devika rani jalsa video

లక్షలు ఖర్చు పెట్టి బర్త్ డే పార్టీ : వెలుగులోకి దేవికారాణి జల్సాల వీడియో

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఈఎస్ఐ మందుల స్కామ్‌లో అరెస్ట్ అయిన ఐఎంఎస్ డైరెక్టర్‌ దేవికారాణి లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఏసీబీ విచారణలో దేవికారాణి బాగోతాలు

ఈఎస్ఐ మందుల స్కామ్‌లో అరెస్ట్ అయిన ఐఎంఎస్ డైరెక్టర్‌ దేవికారాణి లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఏసీబీ విచారణలో దేవికారాణి బాగోతాలు బట్టబయలవుతున్నాయి. తాజాగా దేవికారాణి జల్సాల వీడియో ఒకటి బయటపడింది. బర్త్ డే పార్టీ కోసం ఆమె చేసిన ఖర్చు, డ్యాన్సుల వీడియో హాట్ టాపిక్ గా మారింది. బర్త్ డే వేడుకల కోసం దేవికారాణి లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఆ పార్టీలో హంగామా చేశారు. డ్యాన్సులతో చెలరేగిపోయారు.

దోచుకున్న సొమ్ముతో పూర్తిగా ఎంజాయ్‌ చేశారు దేవికారాణి. ఇప్పుడు బయటకొచ్చిన వీడియోలు కలకలం రేపుతున్నాయ్‌. లక్షలు ఖర్చు చేసి బర్త్‌ డే పార్టీలు నిర్వహించారు. భారీ విల్లా కొనుగోలు చేశారు. పీఎంజీ వంటి అతిపెద్ద జువెలరీ షాపులో కోట్ల విలువైన నగలు కొనుగోలు చేశారు దేవికారాణి. 

ప్రభుత్వ డబ్బుకు కాపలాగా ఉండాల్సిన దేవికారాణి.. అవినీతిని ప్రోత్సహించడంలో ఏ మాత్రం వెనుకాడ లేదు. 2016-18 మధ్యకాలంలో మహిధర్‌ మెడికల్‌ అండ్‌ సర్జికల్‌ నుంచి రూ.4 కోట్ల విలువైన మందులు కొనుగోలు చేశారు. వీటి వాస్తవ విలువ రూ.62 లక్షలే. మిగతా రూ.3 కోట్లకు పైగా సొమ్ము దేవికారాణి ఖాతాల్లోకి వెళ్లిపోయాయి. వీటన్నింటి ఆధారాలను ఏసీబీ సంపాదించింది. జై సాయిరామ్‌ సంస్థ నుంచి మరో రూ. 4 కోట్ల విలువైన మందులు కొనుగోలు చేశారు. వీటి వాస్తవ విలువ కూడా రూ. 12 లక్షలుగా బయటపడింది.

తేజా ఫార్మా నుంచి రూ.5.5 కోట్ల విలువైన మందులు కొనగా.. వీటి విలువ కోటి 41 లక్షలుగా గుర్తించింది ఏసీబీ. తేజా ఫార్మా ప్రతినిధులతో కలిసి మొత్తం 8 డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసింది దేవికారాణి. ఈ షెల్‌ కంపెనీల నుంచి వచ్చిన సొమ్మును కూడా పీఎంజీ జువెలరీ షాపునకు మళ్లించినట్లు తెలిసింది. రూ. 5 కోట్ల విలువైన నగలను దేవికారాణి కొన్నట్లు అధికారులు ఆధారాలు సంపాదించారు. మిగతా సొమ్మును దేవికారాణి, నాగలక్ష్మి పంచుకున్నట్లు దర్యాప్తులో బయటపడింది.

మొత్తం 8 షెల్‌ కంపెనీల ద్వారా రూ. 25 కోట్లకు పైగా మందులు కొనుగోలు చేసి డబ్బులు డ్రా చేసిందామె. ఈ మందుల వాస్తవ విలువ 4 కోట్లు అయితే.. మిగతా సొమ్మును దేవికారాణి, నాగలక్ష్మి అకౌంట్లలో పడినట్లు గుర్తించారు అధికారులు. ఈఎస్‌ఐ స్కామ్‌లో తాజాగా తేజా ఫార్మా ఎండీ శ్రీనివాసరెడ్డిని అరెస్ట్‌ చేసింది ఏసీబీ. దీంతో ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్‌ అయిన నిందితుల సంఖ్య 17కు చేరింది. 

READ  ఇంకా పరారీలోనే తహసీల్దార్ హసినబీ : కొత్త విషయం తెలిసి అధికారులు షాక్

దండుకున్న డబ్బుతో దేవికారాణి చాలా జల్సా జీవితం గడిపినట్లు ఏసీబీ దర్యాప్తులో గుర్తించారు. పెద్ద మొత్తంలో ఆస్తులు సంపాదించిందామె. కోట్ల విలువైన నగలను కొనుగోలు చేసింది. డొల్ల కంపెనీలను నెలకొల్పి.. నేరుగా జువెలరీ షాపులకే డబ్బును మళ్లించింది.

Related Posts