ఈఎస్ఐ స్కామ్ కేసులో రెండోసారి దేవికారాణి అరెస్ట్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కామ్‌లో ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవికారాణి మరోసారి అరెస్ట్ అయ్యారు.. ఈ కేసులో ఏసీబీ అధికారులు ఆమెను రెండోసారి అరెస్ట్ చేశారు. ఈఎస్ఐ స్కామ్ లో ప్రధాని నిందితురాలిగా ఉన్న దేవికారాణితో పాటు మరో 8 మందిని ఏసీబీ అరెస్ట్ చేసింది.ఉస్మానియా ఆస్పత్రిలో నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత ఏసీబీ కోర్టులో నిందితులను ఏసీబీ అధికారులు హాజరుపరిచారు. ఈఎస్ఐ స్కామ్ కేసులో ఏసీబీ అధికారులు 6.5 కోట్ల అవినీతిని బయటపెట్టారు.

ఈ కేసులో దేవికారాణిని మొదటిసారి అరెస్ట్ చేసిన సమయంలో ఆమె ఆస్తుల చిట్టాను గుర్తించిన ఏసీబీ షాక్ అయింది.. దేవికాకు సంబంధించి రూ.35 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించి సీజ్ చేసింది.బయటి మార్కెట్‌లో ఈ ఆస్తుల విలువ సుమారుగా రూ.200 కోట్ల వరకూ ఉండొచ్చునని ఏసీబీ అంచనా వేస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని కూడా దేవికారాణిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు..

Related Tags :

Related Posts :