కార్తీక మాసం ప్రారంభం.. తొలి సోమవారం శైవక్షేత్రాలు భక్తులతో కళకళ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Siva temples for Karthika Masam celebrations : సోమవారం (నవంబర్ 16) నుంచి కార్తీక మాసం ఘనంగా ప్రారంభమైంది.

కార్తీకమాసం తొలి సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు.. శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి.

ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శివాలయాలకు భక్తుల రాకమొదలైంది.శివుడికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున నుంచే భక్తులు కార్తీ దీపాలు వెలిగించి భక్తులు పూజలు చేస్తున్నారు.

తెలుగురాష్ట్రాల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. మాస్క్ లు, శానిటైజర్లను కూడా అందుబాటులో ఉంచినట్టు ఆలయ అధికారులు చెబుతున్నారు.

కార్తీకమాసంలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు


శివ,కేశవులకు అత్యంత ప్రీతికరమైనది కార్తీకమాసం అని చెపుతారు పెద్దలు. ప్రతిఏటా దీపావళి వెళ్లిన మర్నాటి నుంచి కార్తీక మాసం ప్రారంభం అవుతుంది.

అత్యంత మహిమాన్విత మైన కార్తీక మాసంలో భక్తులు నియమ నిష్టలతో చేసే నోములు, వ్రతాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ నెల రోజులు శైవ క్షేత్రాలు భక్తుల శివనామ స్మరణతో మారు మోగిపోతాయి.శివ,పార్వతుల అనుగ్రహం కోసం భక్తులు విశేష పూజలు చేస్తారు. తెలుగు సంవత్సరాలలో ఎనిమిదో నెల కార్తీకమాసం.

చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసిన రోజు కార్తీకం. కార్తీక మాసం సదాశివుడు, మహావిష్ణువు పూజలకు చాలా పవిత్రమైనది.

ఈ మాసం వివిధ వ్రతాలకు శుభప్రదమైంది. ధార్మిక యోచనలున్న వారు ఈ మాసంలో ఏకభుక్తం, నిరాహారాది వ్రతాలు చేస్తారు.

సాయంత్రాలు దేవాలయాలు, తులసి కోట దగ్గర దీపాలు వెలిగిస్తారు.దీపదానాలు చేయలేనివారు, దీపాలు వెలిగించినా దీపదానం అంత ఫలితం లభిస్తుంది. కార్తీక మాసం ఆరంభం నుండే ‘ఆకాశదీపం ప్రారంభమవుతుంది.

ఉదయం, సాయంత్రం ఆలయాలు, పూజామందిరాలు, తులసి కోట వద్ద దీపారాధన చేస్తే ఇహ, పర సౌఖ్యాలు కలుగచేస్తుంది.

ఈ మాసంలో ప్రతి సోమవారంతో పాటు ….ఉత్థానైకాదశి, కార్తీక శుద్ధ ద్వాదశి, కార్తీక పౌర్ణమి వంటి దినాలు ప్రశస్తమైనవి.ఈ మాసానికి కౌముది మాసం అని మరో పేరు కూడా ఉంది. కార్తీక మాసం అంటేనే స్నాన, దాన, జపాలు, పూజలు, దీక్షలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించటం వంటివి చేయడం వలన జన్మ,జన్మల పాపాలను పోగొట్టుకుని పుణ్యాన్ని సంపాదించుకునే మహిమాన్వితమైన మాసంగా భక్తులు విశ్వసిస్తారు.

చాంద్రమానం ప్రకారం కార్తీక మాసం ఎనిమిదవది. శరదృతువులో రెండవ మాసం. ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి “కార్తీకమాసం” అని పేరు వచ్చింది.కార్తికమాసంలో చేసే దీపారాధనకు కూడా ఎంతో విశిష్టత ఉంది. ఈ మాసంలో ప్రతిరోజూ మాత్రమే కాదు.. కార్తికపౌర్ణమి రోజున వెలిగించే 365 దీపాల వల్ల గత జన్మలోనే కాదు.. ఈ జన్మలో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని అంటారు.ఈ నెలలో కుదిరినన్ని రోజులు… తెల్లవారు జామునే లేచి స్నానం చేసి.. కృత్తికా నక్షత్రం అస్తమించే లోగా తులసి కోటముందు దీపం పెడితే మంచిదని చెబుతారు.

అలా ఉదయం పెట్టే దీపం విష్ణువుకు చెందుతుందనీ.. సాయంత్రం పెట్టే దీపం తులసికి చెందుతుందని చెబుతారు.

Related Tags :

Related Posts :