రజినీ బయోపిక్ : మామ పాత్రలో అల్లుడు!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Rajinikanth Biopic: ‘నా దారి.. రహదారి’, ‘బాషా- నేను ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్లే’, ‘నాన్నా పందులే గుంపుగా వస్తాయి- సింహం సింగిల్ గా వస్తుంది’.. ఈ డైలాగ్స్ వింటే వెంటనే గుర్తొచ్చేది సూపర్ స్టార్ రజినీ కాంతే. కానీ ఇప్పుడు ఈ డైలాగ్స్ రజినీ కాంత్ అల్లుడు ధనుష్ నోటి నుంచి వినబోతున్నాం. ఎందుకంటే మోస్ట్ అవెైటెడ్ రజినీ కాంత్ బయోపిక్‌లో కోలీవుడ్ యంగ్ స్టార్ ధనుష్ నటించబోతున్నారు. Rajinikanthసౌత్‌లోనేకాదు నార్త్‌లో కూడా తన హవా నడిపిస్తున్న సూపర్ స్టార్ రజినీ కాంత్ బయోపిక్ తెరకెక్కబోతోంది. చాలా కాలం నుంచి ఈ సినిమా గురించి చర్చలు జరుగుతున్నా.. ఇన్నాళ్లకి ఈ సినిమా మీద క్లారిటీ వచ్చింది. రజినీ కాంత్ స్టైల్‌ని, బాడీ లాంగ్వేజ్‌ని, ఆ డైలాగ్ స్పీడ్‌ని క్యాచ్ చెయ్యడం అంత ఈజీ కాదు. అందుకే హీరోని డిసైడ్ చెయ్యడానికి ఇంత టైమ్ తీసుకున్నారు.


రజినీ కాంత్ రెప్లికా అంటే అంత ఈజీ కాదు. ఈ స్టార్ హీరో స్టైల్‌ని ఫాలో అవ్వడం చాలా కష్టం. ఆయన ఈజ్, బాడీ, స్పెషల్లీ రజినీ యంగ్, ఓల్డ్ ఏజ్ ఇలా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్‌ని చూపించగల రజినీ కాంత్ అల్లుడు ధనుష్‌నే హీరోగా ఫిక్స్ చేశారు. ఎటువంటి గాడ్ ఫాదర్ లేకుండా కండక్టర్ స్టేజ్ నుంచి కంట్రీ గర్వపడే స్థాయి క్రేజీ హీరోగా ఎలా ఎదిగారో చూపించబోతున్నారు మేకర్స్ .

Rajinikanth

లింగుస్వామి డైరెక్షన్లో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో రఫ్ ఆడించే రజినీ డైలాగ్స్‌తో పాటు, దుమ్ము రేపే స్టార్ హీరో స్టైల్‌ని ఈ బయోపిక్‌లో ధనుష్ చూపించబోతున్నారు. రజినీ లానే ధనుష్‌కి కూడా మాస్ ఫాలోయింగ్, ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉన్నాయి. కెరీర్‌లో కమర్షియల్ సినిమాలు కాకుండా స్టోరీ డ్రైవెన్ సినిమాలు, ఎక్స్‌పెరిమెంటల్ మూవీస్ చెయ్యడంలో ధనుష్ ముందుండడంతో రజినీ క్యారెక్టర్‌కి 100 పర్సెంట్ సూట్ అవుతాడని కోలీవుడ్ భావిస్తోంది.


Related Tags :

Related Posts :