Dheevara First Look Launched by Director Bobby-10TV

ధీవర ఫస్ట్ లుక్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

నాగసాయి, విదా చైతన్య జంటగా, విజయ్ జక్కి డైరెక్షన్‌లో, బి.మార్కండేయులు సమర్పణలో, హరనాథ బాబు నిర్మిస్తున్న సినిమా.. ధీవర. ఈ టైటిల్ వినగానే బాహుబలిలో ధీవర అనే సాంగ్ గుర్తొస్తుంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ధీవర మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. జై లవ కుశ ఫేమ్ బాబీ చేతుల మీదుగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయించారు మేకర్స్. హీరో వెనక్కి తిరిగి, హీరోయిన్‌ని ఎత్తుకుని గట్టిగా హగ్ చేసుకోగా, హీరోయిన్, హీరో నడుము చుట్టూ రెండు కాళ్లు వేసి, రెండు చేతులు అతని మెడ చుట్టూ వేసింది.

ఇద్దరూ లిప్‌లాక్ చేసుకుంటున్నట్టుగా, యూత్‌ని ఎట్రాక్ట్ చేసేలా ఉంది ధీవర ఫస్ట్ లుక్ పోస్టర్. ఫస్ట్ లుక్ లాంచ్ చేసి, మూవీ యూనిట్‌ని అభినందించాడు డైరెక్టర్ బాబీ. లవ్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుంతున్న ధీవర ఆడియోని త్వరలో రిలీజ్ చెయ్యనున్నారు. ఈ సినిమాకి ఫోటోగ్రఫీ : సాగర్ గొల్ల, ఎడిటింగ్ : కార్తీక్, మ్యూజిక్ : అద్దంకి వెంకటేష్.


       

Related Posts