లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

డైలాగ్ వార్ : నాగబాబు కామెంట్స్ కు ప్రకాశ్ రాజ్ కౌంటర్

Published

on

Prakash Raj counters Nagababu comments : మెగా బ్రదర్‌ నాగబాబు, సినీనటుడు ప్రకాశ్‌ రాజ్‌మధ్య వివాదం రాజుకుంది. ఇరువురు వరుస ట్వీట్లతో విమర్శలు గుప్పించుకుంటున్నారు. పవన్‌ కళ్యాణ్ రాజకీయ ఊసరవెళ్లి అంటూ నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన కామెంట్స్ ఈ వివాదానికి కారణయ్యాయి. దీంతో ఇద్దరి మధ్య డైలాగ్‌ వార్‌ నడుస్తోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ బీజేపీకి మద్దతు ప్రకటించడం తనకు నచ్చలేదని ప్రకాశ్‌రాజ్‌ అన్నారు. ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో జనసేన జట్టుకట్టిందని, 2019 ఎన్నికల్లో వామపక్షాలతో కలిశారని.. ఇప్పుడు మళ్లీ బీజేపీతో పవన్‌ జతకట్టాడని ప్రకాశ్‌ అన్నారు. పాలిటిక్స్‌లో నిలకడలేకుండా నిర్ణయాలు తీసుకుంటే రాజకీయ ఊసరవెల్లిగా ముద్రపడే ప్రమాదముందన్నారు.ప్రకాశ్‌ రాజ్‌ వ్యాఖ్యలపై మెగా బ్రదర్‌ నాగబాబు ధీటుగా స్పందించారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే రాజకీయపార్టీలు నిర్ణయాలు తీసుకుంటాయని నాగబాబు అన్నారు. బీజేపీ -జనసేన పొత్తు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తప్పకుండా సత్తా చాటుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రాజకీయాల్లో నిర్ణయాలు అనేకసార్లు మారుతుంటాయని… కానీ అవి ప్రజలు, పార్టీ రెండింటికి ఉపయోగపడేలా ఉంటే ఎంతోమంచిది అన్నారు. జనసేన పార్టీ… జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలపడం వెనుక విస్తృత ప్రజా, పార్టీ ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. మీకు బీజేపీ నచ్చకపోతే విమర్శించండి అందులో తప్పులేదు.. కానీ అదే బీజేపీ లేదా ఇతర పార్టీ అయినా ప్రజలకు మంచి చేస్తే హర్షించాలని సూచించారు. విమర్శించడం తప్ప హర్షించగలిగే మనసులేని మీగురించి ఏం చెప్పగలమంటూ నాగబాబు కౌంటర్‌ ఇచ్చారు. ఈ దేశానికి బీజేపీ, ఏపీకి జనసేన తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా… బీజేపీ – జనసేన శక్తిని అడ్డుకోలేరన్నారు నాగబాబుఈ వ్యాఖ్యలకు ప్రకాశ్‌ రాజ్‌ కూడా కౌంటర్‌ ఇచ్చారు. మాకు తెలుగు వచ్చు… కానీ మీ భాష రాదంటూ నాగబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మీ తమ్ముడి మీద మీకున్న ప్రేమ నాకు అర్థమైంది, అయితే నాకు దేశంమీద ఉన్న ప్రేమను మీరూ అర్ధం చేసుకోండంటూ ట్వీట్‌ చేశారు. మొత్తానికి ప్రకాశ్‌రాజు, నాగబాబు మధ్య తలెత్తిన ఈ వివాదం ఎటుదారి తీస్తుందో చూడాలి.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *