లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

వజ్రాలు దొరికేస్తున్నాయ్..!! వివరాలు తెలుసుకోమంటున్న గవర్నమెంట్

Published

on

Diamond Rush: నాగాలాండ్‌లోని మాన్ జిల్లాలో జరిగిన ఘటన ఇది. అత్యంత విలువైన రాయి దొరకడంతో ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాని గురించి తెలుసుకున్న గ్రామస్థులు, చుట్టు పక్కల ప్రాంతాల వారు అక్కడికి వచ్చి తవ్వడం మొదలుపెట్టారు. పెద్ద సంఖ్యలో గుమిగూడి ఆ ప్రదేశాన్ని తవ్వి అక్కడ దొరుకుతున్న ప్రత్యేకమైన రాళ్లను చేతుల్లోకి తీసుకుని మురిసిపోతున్నారు.

ప్రభుత్వం జియోలజీ డిపార్ట్‌మెంట్‌ను ఆదేశించింది. ఓ నలుగురు జియోలజిస్టులను అక్కడకు వెళ్లి సమాచారం తెలుసుకో్వాలని ఆర్డర్ ఇచ్చింది. ‘వారు అక్కడికి వెళ్లి విషయం తెలుసుకుని వీలైనంత త్వరగా చెప్తారు’ అని డిపార్ట్‌మెంట్ డైరక్టర్ ఎస్ మానెన్ ఆర్డర్ లో చెప్పింది. నవంబర్ 30 లేదా డిసెంబర్ 1నాటికి టీం అక్కడకు చేరుకుని విషయాన్ని కన్ఫామ్ చేయనుంది.ఆ జిల్లా డిప్యూటీ కమిషనర్ ను కాంటాక్ట్ చేయడంతో.. ఈ వారం ఆరంభంలో కొన్ని ప్రత్యేకమైన రాళ్లను అడవిలో పనిచేసిన వాళ్లు గుర్తించారు. ఆ విషయం అందరికీ తెలియడంతో వజ్రాలుగా భావించి వెదకడం మొదలుపెట్టారు. ఇవి వజ్రాలు కావనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. కాకపోతే అక్కడ దొరుకుతున్న ప్రత్యేకమైన రాళ్లు వాళ్ల జీవితాల్లో సంతోషం నింపుతుందని అంటున్నారు.

అవన్నీ సాధారణ రంగు రాళ్లు మాత్రమే. నాగాలాండ్ లోని చాలా ప్రాంతాల్లో అవి దొరుకుతుంటాయని నాగాలాండ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీటీ థాంగ్ తెలిపారు. కొందరి దుష్ప్రచారం కారణంగా గ్రామస్థులు సమయాన్ని వృథా చేసుకుని వాటిని పోగుచేసుకునే పనిలో ఉన్నారు. ఇవి పోగు చేసుకునే క్రమంలో వాంచింగ్ గ్రామం ఇతరులను అనుమతించడం లేదు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *