గుండు గీయించిన ఘటనలో నూతన్ నాయుడి పాత్ర ఉందా ?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

దళిత యువకుడు గుండు గీయించిన ఘటనలో నూతన్ నాయుడి పాత్ర ఉందా ? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. విచారణకు హాజరు కావాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో 2020, ఆగస్టు 30వ తేదీ ఆదివారం పీఎస్ లో హాజరు కానున్నారు నూతన్ నాయుడు.

ఈ ఘటనపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం విశాఖలోని గాంధీ విగ్రహం వద్ద దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఏ 1గా నూతన్ నాయుడిని చేర్చాలని, వెంటనే అతడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఏపీ రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న అరాచకాలు సంచలనం రేకేత్తిస్తున్నాయి. మరో యువకుడికి గుండు గీయించడంపై ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అయితే..లెటెస్ట్ గా జరిగిన ఇన్సిడెంట్ లో బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్ట్ నూతన్ నాయుడు కుటుంబం ఉంది.

నూతన్ భార్య మధులత స్వయంగా దళిత యువకుడు శ్రీకాంత్‌ను విచక్షణా రహితంగా కొట్టడం, గుండు గీయించారు. ఆమె కొడుతున్న క్రమంలో అక్కడ ఇతరులున్నా ఎవరూ ఆపలేదు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో పోలీసులు ఏ1గా మధుప్రియతో పాటు ఏడుగురిని అరెస్టు చేశారు పోలీసులు.

నూతన్ నాయుడు ప్రోద్బలంతోనే..వారంతా రెచ్చిపోయారని, చుట్టూ గుమికూడి చిత్ర హింసలు పెట్టారని దళిత సంఘాలు వెల్లడిస్తున్నాయి. తూతు మంత్రంగా విచారించొద్దని డిమాండ్ చేస్తున్నారు. మరి పోలీసుల విచారణలో నూతన్ నాయుడి పాత్ర ఉందా ? లేదా అనేది తెలుస్తుంది.

అసలు ఏం జరిగింది :
శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన పర్రి శ్రీకాంత్ (20)కు నాన్నమ్మ, చెల్లి ఉన్నారు. ఉపాధి కోసం విశాఖకు వచ్చాడు. సుజాతనగర్ కాలనీ నివాసంలో ఉంటున్న సినీ నిర్మాత, బిగ్ బాస్ 2 కంటెస్ట్ ఎన్. నూతన్ నాయుడు ఇంట్లో నాలుగు నెలల క్రితం పనికి కుదిరాడు.

ఈ నెల 1వ తేదీన జీతం తీసుకుని పని మానేశాడు. కానీ ఇదే టైంలో నూతన్ నాయుడి ఇంట్లో ఓ సెల్ ఫోన్ మాయమైంది. ఇది శ్రీకాంత్ దొంగిలించాడని నూతన్ నాయుడి కుటుంబం అనుమానించింది. సెల్ ఫోన్ విషయంలో మాట్లాడాని నూతన్ భార్య..శ్రీకాంత్ ను ఇంటికి రప్పించింది. పోలీసులకు ఫిర్యాదు చేసుకోవాలని చెప్పి అక్కడి నుంచి శ్రీకాంత్ వచ్చేశాడు.

అదే రోజు మధ్యాహ్నం మరోసారి తమ సూపర్ వైజర్ ద్వారా శ్రీకాంత్ ను ఇంటికి పిలిపించారు. నూతన్ భార్య, ఇంట్లో పని చేస్తున్న సిబ్బంది గట్టిగా నిలదీశారు. ఎదురు తిరిగాడన్న ఆగ్రహంతో నూతన్ భార్య..కర్రతో విచాక్షణారహితంగా కొట్టారు.

READ  youtubeలో చూసి నకిలీ కరెన్సీ ప్రింట్ చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు

అంతటితో ఆగక..కటింగ్ చేసే వ్యక్తిని ఇంటికి పిలిపించి..శ్రీకాంత్ కు గుండు గీయించారు. ఈ విషయాన్ని మీడియాకు శ్రీకాంత్ చెప్పాడు.

Related Posts