Drugs case: రకూల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ తీసుకుందా ?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

బాలీవుడ్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో తెరపైకి వచ్చిన డ్రగ్స్ కేసులో అరెస్టయిన రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ బాంబు పేల్చినట్టు తెలుస్తోంది. బాలీవుడ్‌లో డ్రగ్స్ వాడుతున్న 25 మంది బడాబాబుల పేర్లు బయటపెట్టినట్టు సమాచారం. అందులో నటులు, నిర్మాతలు, దర్శకులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. రియా చెప్పిన పేర్లలో టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సైమోన్ ఖంబట్టా పేర్లు ఉన్నట్లు సమాచారం.



ఇప్పటికే రియా చక్రవర్తి అరెస్ట్ కాగా… డ్రగ్స్ సరఫరా, కొనుగోలు వ్యవహారంలో బాలీవుడ్ హీరోయిన్లు సారా ఆలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, డిజైనర్ సైమోన్ ఖంబట్టా పేర్లు తెరపైకి వచ్చాయి. దీంతో హిందీ చిత్ర పరిశ్రమతో పాటు దక్షిణాదిలో కూడా కలకలం రేపింది. వారందరికీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో త్వరలో నోటీసులు ఇవ్వనుంది. 25 మంది డ్రగ్స్ వినియోగించడమో, లేకపోతే డ్రగ్స్ సరఫరా చేసేవారితో సంబంధాలు కలిగి ఉన్నవారేనని రియా చెప్పినట్టు సమాచారం.

రియా చక్రవర్తి కాల్ లిస్టులో రకుల్ ప్రీత్ సింగ్ సహా ఇతరుల పేర్లు కూడా బయటకు వచ్చాయి. అయితే అప్పట్లో కాల్ డేటాను అంతగా పట్టించుకోలేదు. తాజాగా జాతీయ ఛానెల్ వేసిన వార్తలో రకుల్ ప్రీత్ పేరు ప్రధానంగా వినిపించడం చర్చనీయాంశమైంది.

డ్రగ్స్ కేసులో అరెస్టై 14 రోజుల కస్టడీలో ఉన్న రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారించడంతో దాదాపు 25 మంది బాలీవుడ్ యాక్టర్లు, దర్శకులు, ప్రొడ్యూసర్లు పేర్లు బయటకు వచ్చాయనే ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్‌లో డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్న వారిలో అగ్ర హీరోలు, హీరోయిన్లు ఉన్నారనే విషయం సంచలనంగా మారింది.



రియా, సారాకు… అలాగే రియా, రకుల్‌కు మధ్య మంచి స్నేహం ఉందనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఇటీవల ఈడీకి లభించిన వాట్సప్‌ ఛాట్‌లో సారా సుల్తాన్ అనే పేరు కనిపించడంతో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు.. రియా, సారా ఆలీఖాన్‌కు, అలాగే రియా, రకుల్‌కు మధ్య మంచి స్నేహం ఉందనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఈ వ్యవహారంపై రకుల్ ఇచ్చే వివరణ కోసం ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

రకూల్ ప్రీత్ సింగ్ కు తెలుగులో అవకాశాలు రావడం లేదు. ఇటీవలే హిందీలో అజయ్ దేవ్ గన్ తో దేదే ప్యార్ దేదే సినిమాలోనటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాపీస్ వద్ద మంచి విజయం సాధించింది. హాట్ హాట్ షూట్ లు చేస్తూ..కుర్రాళ్ల మతులను పొగొడుతోంది. లాక్ డౌన్ టైంలో వర్క్ అవుట్స్, ఫిట్‌నెస్‌తో తన అందాన్ని రెట్టింపు చేసుకునే పనిలో పడింది. ప్రముఖ వెయిట్ లిఫ్టర్ కర్ణం మల్లేశ్వరి బయోపిక్‌లో ఈ ముద్దుగుమ్మ నటించనుందని టాక్ వినిపిస్తోంది.

Related Posts