‘అంతర్వాహిని’!.. పవన్ 27 టైటిల్ హింట్ ఇస్తూ క్రిష్ ఎమోషనల్ పోస్ట్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Krish Emotional post: టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం తన దర్శక నిర్మాణంలో వైష్ణవ్‌ తేజ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లతో క్రిష్‌ ఓ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. మరోవైపు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ 27వ సినిమాను క్రిష్‌ డైరెక్ట్‌ చేస్తున్నారు.


‘వకీల్‌సాబ్‌’ షూటింగ్‌ పూర్తి కాగానే పవన్‌, క్రిష్‌ కాంబినేషన్‌లో సినిమా స్టార్ట్‌ అవుతుంది. పవన్‌ పుట్టినరోజున ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. పీరియాడికల్‌ జోనర్‌లో తెరకెక్కబోయే ఈ సినిమాను ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు.


ఈ సినిమాకు ‘బందిపోటు’, ‘గజదొంగ’, ‘ఓం శివమ్‌’.. ఇలాంటి టైటిల్స్‌ పరిశీలనలోఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఈ లిస్టులో ‘‘అంతర్వాహిని’’ అనే టైటిల్‌ కూడా చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


అయితే అంతర్వాహిని టైటిల్‌ విషయం నెట్టింట హల్‌ చల్‌ చేస్తుండగానే క్రిష్‌ తన ఇన్‌స్టాలో రైటర్‌ సాయిమాధవ్‌ బుర్రా రాసిన అంతర్వాహిని అనే కవితను పోస్ట్‌ చేశారు. స్ఫూర్తివంతంగా ఉన్న ఈ కవిత నచ్చి క్రిష్‌ షేర్‌ చేశారా? లేక పవన్‌ 27వ సినిమా టైటిల్‌ ఇదేనా? అంటూ సోషల్ మీడియాతో పాటు ఫిలింనగర్‌లోనూ చర్చ జరుగుతోంది.

View this post on Instagram

అంతర్వాహిని..

A post shared by Krish Jagarlamudi (@director_krish) on

Related Posts