కొత్త రూల్..మాస్క్ పెట్టుకోకపోతే శ్మశానంలో గోతులు తవ్వాలి..!!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా కాలం. మాస్కులు పెట్టుకోకుంటే ఏకంగా శ్మశానానికి పంపించేసే కొత్త రూల్ ను అమలులోకి తీసుకొచ్చింది ఇండోనేషియా. శ్మశానంలో పనులు చేయిస్తారు. ఏం పనులంటే..కరోనా రోగులను పూడ్చిపెట్టటానికి సమాధుల గోతులు తవ్విస్తారు. మాస్కులు పెట్టుకోకపోతూ జరిమానా కింద డబ్బులు వసూలు చేస్తారు. కానీ ఈ కొత్తరూల్ ఏంటీ అంటూ ఆ దేశ ప్రజలు హడలిపోతున్నారు.


కరోనా రోజు రోజుకు పెరిగిపోతున్న క్రమంలో జనాలు భయం కూడా పోయిందో ఏమోగానీ..మాస్క్ లేకుండా తిరిగేస్తున్నారు చాలామంది..అధికారులు ఎన్ని రూల్స్ పెట్టినా పట్టించుకోవాట్లేదు. ఎన్ని ఫైన్లు వేసినా..అదే పరిస్థితి. దీంతో అధికారులు ఓ వినూత్న ఐడియా వేశారు. మాస్క్ లేకుండా కనిపించినవారికి ఫైన్లు వేయకుండా వారిని అక్కడ సమీపంలో ఉన్న శ్మశానానికి పంపించి కరోనాతో చనిపోయిన రోగుల కోసం గోతులు తవ్విస్తున్నారు.


కరోనా : నవంబర్ నాటికి చైనా వ్యాక్సిన్


మాస్కులు ధరించకుండా జనాల్లో తిరుగుతున్నవారిని నియంత్రించటానికి ఇండోనేషియా అధికారులు వింతవింత శిక్షలు విధిస్తున్నారు. దీంట్లో భాగంగా..మాస్కులు ధరించకుండా ఉత్త ముఖాలతో బయటికొచ్చే వారిని శ్మశానాలకు తరలించి వారితో కరోనాతో చనిపోయిన వారిని పూడ్చడానికి సమాధుల గోతులు తవ్విస్తున్నారు. ఇదే వారికి శిక్ష అంటున్నారు అధికారులు.ఈక్రమంలో తూర్పు జావాలోని గ్రెసిక్ రీజెన్సీలో ఇటీవల ఎనిమిది మంది మాస్క్‌లు ధరించకుండా తిరుగుతుండగా వారిని పట్టుకుని కరోనాతో చనిపోయిన వారికి సమాధులు తవ్వాలని అధికారులు ఆదేశించారు.


ఈ వింత శిక్ష సందర్భంగా సెర్మ్ జిల్లా అధిపతి సుయోనో మాట్లాడుతూ.. ప్రస్తుతం శ్మశాన వాటికలో సమాధుల గోతులు తవ్వటానికి కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారనీ..కానీ కరోనాతో మరణించినవారిని సమాధి చేయాలంటే అదనంగా మనుషులు కావాల్సి వస్తోందని కానీ ఎవ్వరూ ఈ పనిచేయటానికి రావటంలేదని అన్నారు.

ఇటు పని జరుగుతుంది..అటు మాస్కులు పెట్టుకోనివారికి ఇటువంటి శిక్షలు వేస్తే ప్రజలు మాస్కులు ధరిస్తారని.. అందుకే శిక్షగా ఈ పని అప్పగిస్తే బాగుంటుందని భావించామని తెలిపారు. ఇలా ఒక దెబ్బకు రెండు పిట్టల్లాగా..అటు జనాల్లో భయం కలిగి మాస్కులు పెట్టుకుంటారని లేకుంటే వారు ఈ పని చేయాల్సిందేనని తెలిపారు.


ఈ వింత శిక్ష ప్రజల్లో మంచి ప్రభావం చూపిస్తోందని ఇప్పుడు మాస్కకులు పెట్టుకోకుండా బైట తిరిగేవారు తగ్గారని తెలిపారు.మాస్క్ పెట్టుకోకుంటా సమాధులు తవ్వాల్సి వస్తుందని ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరిస్తున్నారని తెలిపారు. కాగా..ఇండోనేషియాలో కరోనా వైరస్ కేసులు రోజుకి 3,000 కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 2,18,382 కేసులు నమోదయ్యాయి. 8,723 మంది కరోనా బారిన పడి మరణించారు.

READ  టీటీడీ భారీ విరాళం: జిల్లాకు రూ. కోటి

Related Posts