లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

డిజిటల్ ఇండియానే టార్గెట్‌గా 3 దేశాల సైబర్ నేరగాళ్లు

Published

on

Cyber Terrorists: తమ దేశాలే పెట్టుబడి పెట్టి సైబర్ టెర్రరిస్టులను ఉసుగొల్పుతుంది. ఉత్తర కొరియా, పాకిస్తాన్, చైనాలకు చెందిన సైబర్ టెర్రరిస్టుల నుంచి డిజిటల్ ఇండియాకు భారీ ఎత్తులోనే ముప్పు రానుంది. సింగపూర్‌కు చెందిన సైబర్ ఇంటెల్ ఫర్మ లేటెస్ట్ రిపోర్టులో ఇలా వెల్లడించింది.

‘ఇండియా థ్రెట్ ల్యాండ్‌స్కాప్ రిపోర్ట్ 2020′ ప్రకారంగా మల్టిపుల్ సైబర్ హ్యాకింగ్ గ్రూపులు ఇండియాపై టార్గెట్ చేయాలనుకుంటున్నాయి. ప్రత్యేకించి చైనా, పాకిస్తాన్, ఉత్తరకొరియాలు స్పాన్సర్ చేసిన నాలుగు హ్యాకింగ్ గ్రూపులు దాడికి తెగబడాలని అనుకుంటున్నాయి’ అని అందులో పేర్కొంది.స్పాన్సర్ చేస్తున్న గ్రూపుల వివరాలిలా ఉన్నాయి.
1. స్టోన్ పాండా (చైనీస్)
2. మిషన్ 2025 (చైనీస్)
3. లాజరస్ గ్రూప్ (ఉత్తర కొరియా)
4. ఏపీటీ36 (పాకిస్తాన్)

ఈ హ్యాకింగ్ గ్రూపులు ప్రత్యేకంగా గవర్నమెంట్ ఏజెన్సీలను, డిస్కంలను, న్యూస్ ఆర్గనైజేషన్లు దాడి చేయాలనుకుంటున్నాయి. ‘వెబ్ అప్లికేషన్లలో ఉన్న లూప్ హోల్స్ ఆధారంగా డేటాను దొంగిలించడాని, కంపెనీల సమాచారం చోరీ చేయాలని’ సైబర్ టెర్రరిస్టులు డిజిటల్ ఇండియాను దాడి చేయాలనుకుంటున్నారు.

సైఫర్మా ఫౌండర్ కుమార్ రితేశ్ మాట్లాడుతూ.. ‘జియోపొలిటికల్ అనే వి సైబర్ దాడులు చేయడానికి ఉండే ప్రధాన కారణాల్లో ఒకటి. ప్రస్తుతం దాడి చేయాలనుకుంటున్న దేశాల్లో చైనా, పాకిస్తాన్‌లు కొత్తగా చేరాయి.

వీరంతా పాకిస్తాన్ స్పాన్సర్ చేసిన హ్యాకింగ్ గ్రూపులు.. డిఫెన్స్ సమస్యలు వచ్చిన తర్వాత ఇండియా, కేంద్ర పాలిత ప్రాంతాల్లో దాడి చేయాలనుకుంటున్నారు. టెక్నాలజీకి సంబంధించిన పెట్టుబడులకు, పెద్ద రేంజ్ లో ప్రొడక్షన్ పెట్టాలనుకునే విషయంలో ఇండియా బాగా సానుకూలంగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఇండియాను టార్గెట్ చేస్తే పెట్టుబడులు తగ్గి ఆర్థికంగా కుదేలవుతుందని ప్లాన్ చేస్తున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *