రజనీకాంత్ సర్‌లా యాక్ట్ చేయాలనుకుంటున్నా.. సుశాంత్ సింగ్ డైలాగ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Dil Bechara సినిమా రిలీజ్ అయిన రెండో రోజే సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫ్యాన్స్ తో పాటుగా రజనీకాంత్ ఫ్యాన్స్ కూడా ట్విట్టర్లో సినిమా షాట్ లను పోస్టు చేస్తున్నారు. ఈ పోస్టుల్లో లేట్ యాక్టర్ సుశాంత్.. రజనీకాంత్ పై ఉన్న ప్రేమ కనిపిస్తుంది. సినిమా కథలో భాగంగానే మ్యాన్నీ రాజ్‌కుమార్ (సుశాంగ్ సింగ్ రాజ్‌పుత్) రజనీకాంత్ సర్ పై తనకున్న అభిమానం గురించి చెప్తుంటాడు.

సినిమాలో రజనీకాంత్ గురించి ప్రస్తావన రాగానే మంచి హాట్ టాపిక్ అయింది. మ్యాన్నీ టీ షర్టులు, వాటి మీద పోస్టర్లు బ్యాక్ గ్రౌండ్లో రజనీకాంత్ స్టిల్స్ కనిపిస్తున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. అలా కనిపిస్తుండగా ‘నాకు రజనీ సర్ లా యాక్ట్ చేయాలనుంది’ అని సుశాంత్ డైలాగ్ చెప్తాడు.

ఈ ట్వీట్ సెలబ్రేషన్స్ లో సైఫ్ అలీ ఖాన్ కూడా దూరిపోయాడు. ‘సైఫ్ అలీ ఖాన్ తలైవాపై అడ్మిరేషన్ ను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ముఖేశ్ చాబ్రా తీసిన సినిమాపై మాటల్లో చెప్పలేకపోతున్నానని, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ను మిస్ అవుతున్నానని’ ట్వీట్ చేశాడు.

ఫిల్మ్ క్రిటిక్స్ మూడు స్టార్లు కంటే ఎక్కువ రేటింగ్ ఇచ్చారు. దిల్ బెచారా సినిమా సుషాంత్ సింగ్ రాజ్ పుత్ కు చెందినదే. సినిమా మొత్తం ఎలా ఉన్నా.. సుషాంత్ యాక్టింగ్ అనేది హైలెట్ అని మెసేజ్ ఇచ్చాడు.

Related Tags :

Related Posts :