బిగ్ బాస్ సీజన్ విన్నర్ రొమాంటిక్ వీడియో సాంగ్‌కు హృతిక్‌రోషన్ కూడా ఫిదా

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

బిగ్ బాస్ సీజన్ విన్నర్.. అదేనండి తెలుగు వాళ్లకు బాగా దగ్గరైన చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ లీడ్ రోల్ యాక్టర్ శివ(సిద్దార్థ్ శుక్లా) సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. నేహా శర్మతో పాటు రొమాంటిక్‌, ఎమోషనల్‌‌ సాంగ్‌ ‘దిల్‌ కో కరార్ ఆయా‌’ యుట్యూబ్‌లో పెద్ద హిట్ అయింది. శుక్రవారం విడుదల చేసిన ఈ పాట యుట్యూబ్‌లో విడుదలైంది. విడుదలైన 9 గంటల్లోనే 25 లక్షల వ్యూస్‌ సంపాదించి యుట్యూబ్‌లో‌‌ ట్రెండ్‌ అయిపోయింది.‘దిల్‌ కో కరార్‌ ఆయా‌’ అంటూ సాగే ఈ పాట లింక్‌ను శుక్లా కూడా తన అభిమానులతో ట్విటర్‌లో పంచుకున్నారు. ‘దీనిని మీరు ఇష్టపడతారని ఆశిస్తున్నాను… ఈ పాటపై మీ అభిప్రాయాన్ని నాకు తెలపండి’ అని ట్వీట్‌లో పేర్కొన్నాడు. శుక్లాపై అభిమానమే కాదు. పాటకు మ్యూజిక్.. కెమెరా పనితనం అంతా కుదరడంతో అభిమానులను ఆకట్టుకుంటుంది. శుక్లా, నేహా రోమాంటిక్‌ పాటకు తెగ ఫ్యాన్స్ అయిపోతున్నారు. ఈ పాటకు ఫిదా అవుతున్న నెటిజన్లు కామెంట్స్‌లో హర్ట్‌ ఎమోజీల వర్షం కురిపిస్తున్నారు.‘తన అభిమానుల కోసం సిద్దార్థ్‌ శుక్లా మరోసారి ప్రేమ, సంతోషాన్ని విస్తరించారు. ఈ పాట నాకు చాలా బాగా నచ్చింది. ఆయన నుంచి నా కళ్లు తిప్పుకోలేకపోయాను’, ‘సిద్దార్థ్‌ హార్ట్…‌ చూస్తూనే ఉండండి’, ‘ఈ పాట మొత్తం ప్రేమ, ఎమోషన్స్‌తో నిండి ఉంది’ అంటూ నెటిజన్లు పలురకాల కామెంట్స్‌ చేస్తున్నారు.

Related Posts