Dil Toh Happy Hai Ji fame actress Sejal Sharma commits suicide; co-actor Aru K Verma confirms

ఇంట్లో ఉరేసుకుని టీవీ నటి ఆత్మహత్య

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సెలబ్రిటీలు ఆత్మహత్యలు చేసుకోవడం ఇటీవలికాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌లో టాప్‌లో ఉన్న వాళ్లు కూడా ఏదో ఒక కారణంతో అర్థంతరంగా తనువు చాలిస్తున్నారు. ఇటీవల కుషాల్ అనే ప్రముఖ టీవీ నటుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే.. సెజల్ శర్మ అనే బుల్లి తెర నటి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. ‘దిల్ తో హ్యాపీ హై జీ’ అనే సీరియల్‌లో నటించిన సెజల్ ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు.

‘దిల్ తో హ్యాపీ హై జీ’లో సెజల్‌తో పాటు నటించిన అరుల్ వర్మ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘సెజల్ ఆత్మహత్య చేసుకుంది. ఈ చేదు విషయాన్ని నేను కూడా నమ్మలేకపోతున్నాను. పదిరోజుల క్రితమే నేను తనని కలిశాను. మొన్న ఆదివారం మేమిద్దరం వాట్సాప్‌లో చాటింగ్ కూడా చేసుకున్నాం. గత నాలుగు నెలల్లో నేను తనని కలవలేకపోయాను. అందుకే పది రోజుల క్రితం కలిశాను. అప్పుడు తను చాలా సంతోషంగా ఉంది. నిన్న రాత్రి సెజల్ ఆత్మహత్య చేసుకుంది. ఆమె కుటుంబానికి ఈ విషయం ఉదయం తెలిసింది. తన భౌతికకాయాన్ని అంత్యక్రియల నిమిత్తం ఉదయ్‌పూర్ తీసుకెళ్లారు’ అని అరు వర్మ చెప్పారు.

ఎన్నో టీవీ ప్రకటనల్లో, వెబ్ సిరీస్‌లలో నటించిన సెజల్ దూరం అవ్వడంతో బాలీవుడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆమె ప్రొఫెషనల్ లైఫ్ బాగానే ఉంది కానీ పర్సనల్ లైఫ్‌లో మాత్రం సమస్యలు ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. అందుకే ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని చనిపోయినట్లు చెబుతున్నారు. 
 

Related Posts