వాళ్లు గుండెలాంటి వారు.. ఓ స్థాయికి వచ్చాక మర్చిపోతే ఎలా?.. సూర్యకు ‘సింగం’ హరి లెటర్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Director Hari wrote a Letter to Suriya: సూర్య హీరోగా, నిర్మాతగా సుధా కొంగ‌ర ద‌ర్శక‌త్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘సూర‌రై పోట్రు’. తెలుగులో ‘ఆకాశం నీ హ‌ద్దురా’ పేరుతో విడుద‌ల చేస్తున్నారు.ముందు థియేట‌ర్స్‌లో విడుద‌ల చేయాల‌నుకున్న ఈ సినిమాను ఇప్పుడు Amazon Prime లో విడుద‌ల చేస్తున్నట్లు సూర్య ప్ర‌క‌టించారు. అయితే సూర్య నిర్ణ‌యంపై కోలీవుడ్ డిస్ట్రిబ్యూట‌ర్స్‌, థియేట‌ర్ సంఘాలు ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. ఈ నేప‌థ్యంలో సూర్య‌తో ‘సింగం’ సిరీస్‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు హ‌రి ఓ లేఖ రాశారు.

ఏపీలో 8 స్పెషల్ కోర్టులు ఏర్పాటుకు గవర్నమెంట్ ఆర్డర్స్


‘‘మన ఎదుగుదలకు కారణమైన డిస్ట్రిబ్యూటర్స్‌ను ఇలా ప‌క్క‌న పెట్టేయ‌డం స‌రికాదు. ఓ స్థాయి వ‌చ్చిన త‌ర్వాత డిస్ట్రిబ్యూట‌ర్స్‌ను విస్మ‌రించ‌డం మంచిది కాదు. సినిమా వ్య‌వ‌స్థ‌కు డిస్ట్రిబ్యూట‌ర్సే గుండెలాంటివారు. కాబ‌ట్టి.. త‌న చిత్రాన్ని ఓటీటీలో విడుద‌ల చేసే విష‌యంపై పున‌రాలోచించాలి’’ అన్నారు హ‌రి. ‘సింగం 3’ తర్వాత సూర్య, హరి కాంబినేషన్‌లో రూపొందాల్సిన చిత్రం ‘అరువా’ క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ కార‌ణంగా ఆగిపోయిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై సూర్య కానీ హరి కానీ స్పందించలేదు.Soorarai Pottru

Related Tags :

Related Posts :