లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

షాపింగ్ మాల్ కాదు స్టూడియో కడతా.. అందుకే ‘వేదిక’ ఏర్పాటు చేశా.. దర్శకుడు ఎన్.శంకర్..

Published

on

‘నా తొలి సినిమా ‘ఎన్‌కౌంటర్‌’ 1997 ఆగస్టు 14న విడుదలైంది. ఏడాది తర్వాత సరిగ్గా అదే రోజున ‘శ్రీరాములయ్య’ రిలీజ్‌ అయింది. దర్శకుడిగా నన్ను ప్రపంచానికి పరిచయం చేసిన ఆగస్టు 14 నాకు చాలా ప్రత్యేకమైన తేది. అందుకే ఆ రోజేనే ‘వేదిక’ సంస్థను ప్రారంభిస్తున్నా’ అన్నారు దర్శకుడు ఎన్‌.శంకర్‌.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘సీనియర్‌ నటుడు ప్రభాకర్‌రెడ్డి నన్ను సినిమా పరిశ్రమకు పరిచయం చేస్తే, కృష్ణగారు ‘ఎన్‌కౌంటర్‌’ సినిమాతో దర్శకుడిగా నాకొక వేదిక కల్పించారు. సినిమా పరిశ్రమలో దాదాపు 36 సంవత్సరాలుగా ఉంటున్నా. దర్శకుడిగా 23ఏళ్ల అనుభవం ఉంది. ఈ ప్రయాణంలో నేను కూడా ఒక వేదికగా ఉండాలని ‘వేదిక’ పేరుతో ఓ ఆర్గనైజేషన్‌ ప్రారంభించా. రెండేళ్లుగా దీని మీద వర్క్‌ జరుగుతోంది. యంగ్‌ హీరోలను, డైరెక్టర్స్‌ను, సింగర్స్‌ను ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశం.

నాకున్న పరిచయాలతో కొందర్ని అప్రోచ్‌ అయ్యి.. తక్కవ బడ్జెట్‌లో రెండు సినిమాలు తీయాలని కథలు సిద్ధం చేశా. జూన్‌లో సెట్స్‌ మీదకి వెళ్లాలనుకున్నాం. అలాగే ఐదు వెబ్‌ సిరీస్‌లు కూడా ప్లాన్‌ చేశాం. కరోనా వల్ల వాయిదా పడింది. వేదిక ఆర్గనైజేషన్‌ ద్వారా సినిమా మీద ఆసక్తి ఉన్నవారికి అవకాశం కల్పించడమే నా లక్ష్యం’ అని తెలిపారు. త

ను ఏర్పాటు చేయనున్న స్టూడియో గురించి వివరిస్తూ ‘1984 తర్వాత హైదరాబాద్‌లో ఒక్క స్టూడియో కూడా కట్టలేదు. ఎందుకంటే అది లాభదాయకమైనది కాదు కాబట్టి. అయినా నేను ధైర్యం చేసి కళా సంపదను సృష్టించాలనే కోణంలో ఆలోచిస్తూ స్టూడియో కట్టాలనే నిర్ణయానికి వచ్చాను. 2003లో స్టూడియో కోసం దరఖాస్తు చేశా. పని జరగలేదు. 2012లో దానిమీద చిన్న మూమెంట్‌ వచ్చింది. స్టూడియో కట్టడానికి హాలీవుడ్‌ నిపుణులతో డిజైన్‌ చేయించి 2014లో మళ్లీ ప్రపోజల్‌ పెట్టా. 2019లో దానికి ఓ రూపం వచ్చింది.

స్టూడియో నిర్మాణానికి ప్రభుత్వం సిటీకి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొకిల ప్రాంతంలో ఐదు ఎకరాల భూమిని కేటాయించింది. ఎన్‌.శంకర్‌ ఆ ప్రదేశంలో స్టూడియో కడతాడా? షాపింగ్‌ మాల్‌ కడతాడా అని చాలామంది చర్చ కూడా మొదలుపెట్టారు. ప్రభుత్వం భూమి కేటాయించేది అభివృద్ధి చేయడానికి కానీ అనుభవించడానికి కాదు.. కేసీఆర్‌ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ని వరల్డ్‌ సినిమా హబ్‌గా మార్చాలనే విజన్‌ ప్రభుత్వానికి ఉంది. త్వరలో ఆ పనులు మొదలవుతాయి’ అన్నారు శంకర్‌.