తెలంగాణలో కరోనా బాధితుల రికవరీ రేటు 99 శాతం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తెలంగాణలో కరోనా నుంచి కోలుకున్న వారి రేటు 99 శాతం ఉందని డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణలో 80 శాతం మందికి కరోనా లక్షణాలు లేవని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 9,786 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించారు. తెలంగాణలో కరోనా నియంత్రణపై మంగళవారం (జులై 14, 202) ఆయన మీడియాతో మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ పరిధిలో 30 ఆస్పత్రుల్లో కరోనా టెస్టులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

కరోనా చికిత్స విషయంలో డీ సెంట్రలైజ్‌ చేశారని తెలిపారు. ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో కూడా కరోనా చికిత్స ఉచితంగా చేయనున్నట్లు పేర్కొన్నారు. 54 ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్స కొనసాగుతుందని వెల్లడించారు.​ తెలంగాణలో పది రోజులుగా కరోనా నిర్ధారణ పరీక్షలు పెంచామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 36,221 కరోనా కేసులు నమోదయ్యాయని చెప్పారు.

లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత కరోనా వైరస్‌ వ్యాప్తి పెరుగుతోందన్నారు. రాష్ట్రంలో సోమవారం జులై 13, (2020) ఒక్క రోజే 11,525 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని తెలిపారు. తెలంగాణలో 365 మంది కరోనాతో మృతి చెందారని వెల్లడించారు. దేశంలో కరోనా మరణాల రేటు 2.7 శాతం ఉంటే.. తెలంగాణలో ఒక్క శాతమే ఉందని వెల్లడించారు.

Related Posts