నా ఫ్యామిలీ సేఫ్.. కరోనా పరీక్షల్లో నెగెటివ్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

దర్శకధీరుడు ఎస్‌.ఎస్.రాజమౌళి కరోనా నుంచి కోలుకున్నారు. 2 వారాల క్వారంటైన్ పూర్తయిందని, ప్రస్తుతం తమ కుటుంబంలో ఎవరికీ కరోనా లక్షణాలు లేవని ఆయన ట్వీట్ చేశారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. అందరికీ నెగిటివ్ వచ్చిందని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ప్లాస్మాను దానం చేయడానికి సరిపడా యాంటీబాడీస్ ఏర్పడటానికి 3 వారాల సమయం పడుతుందని, అప్పటివరకూ వేచి ఉండమని డాక్టర్ సూచించినట్లు ఆయన తెలిపారు. తనతో పాటు కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు జూలై 29న రాజమౌళి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

లక్షణాలు తక్కువగానే ఉండటంతో వారంతా అప్పటి నుంచి హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ప్లాస్మాను దానం చేస్తామని ఆ సమయంలోనే రాజమౌళి ప్రకటించారు. రాజమౌళితో సహా ఆయన కుటుంబం సభ్యులందరికీ నెగెటివ్ రావడంతో పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Related Posts