లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

హాలీవుడ్ టీమ్‌తో డిస్కోరాజా – 4 నిమిషాల కోసం రూ. 5 కోట్లు ఖర్చు

డిస్కోరాజా : ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7కు వర్క్ చేసిన టెక్నీషియన్స్ నేతృత్వంలో ఈ సినిమాలోని కీలక సన్నివేశాన్ని తెరకెక్కించబోతున్నారు..

Published

on

disco raja heads to iceland for its second schedule

డిస్కోరాజా : ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7కు వర్క్ చేసిన టెక్నీషియన్స్ నేతృత్వంలో ఈ సినిమాలోని కీలక సన్నివేశాన్ని తెరకెక్కించబోతున్నారు..

మాస్ మహారాజా రవితేజ, వి.ఐ.ఆనంద్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా..   డిస్కోరాజా.. సైన్స్ ఫిక్షన్ అండ్ పిరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో రవితేజ తండ్రీ, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. నభా నటేశ్, పాయల్ రాజ్‌పుత్, తాన్యా హోప్ హీరోయిన్స్‌గా నటిస్తుండగా.. ఎస్.ఆర్.టి. బ్యానర్‌పై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నాడు.

ఇటీవలే గోవా షెడ్యూల్ కంప్లీట్ అవగా.. సెకండ్ షెడ్యూల్ ఐస్‌లాండ్‌లో స్టార్ట్ అయ్యింది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7కు వర్క్ చేసిన టెక్నీషియన్స్ నేతృత్వంలో ఈ సినిమాలోని కీలక సన్నివేశాన్ని తెరకెక్కించబోతున్నారట. 4 నిమిషాల పాటు కొనసాగే ఈ సీన్ కోసం రూ. 5 కోట్లు ఖర్చు పెడుతుండడం విశేషం. సినిమాలో ఇది ఇంపార్టెంట్ సీన్ కావడంతో భారీగా షూట్ చేస్తున్నామని, విజువల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఉంటాయని నిర్మాత తెలిపారు.

క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న చిత్రాన్ని రిలీజ్ చెయ్యనున్నారు. బాబీ సింహా, తాన్యా హోప్, సత్య, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మ్యూజిక్ : థమన్, సినిమాటోగ్రాఫర్ : కార్తీక్ ఘట్టమనేని, ఎడిటింగ్ : నవీన్ నూలి, డైలాగ్స్ : అబ్బూరి రవి.
  

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *