Disco Raja Releasing on January 24th 2020

ఫ్యాన్స్‌కు రవితేజ బర్త్‌డే గిఫ్ట్ ‘డిస్కోరాజా’

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మాస్ మహారాజా రవితేజ, వి.ఐ.ఆనంద్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా.. ‘డిస్కోరాజా’.. సైన్స్ ఫిక్షన్ అండ్ పిరియాడిక్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో నభా నటేశ్, పాయల్ రాజ్‌పుత్, తాన్యా హోప్ హీరోయిన్స్ కాగా ప్రముఖ తమిళ నటుడు బాబీ సింహా విలన్‌గా కనిపించనున్నాడు.

ముందుగా అనుకున్నట్టు డిసెంబర్ 20న కాకుండా 2020 జనవరి 24 డిస్కోరాజా చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు దర్శక, నిర్మాతలు తెలిపారు. జనవరి 26 రవితేజ పుట్టినరోజు సందర్భంగా రెండు రోజుల ముందుగానే సినిమా విడుదల చేయనున్నారు.

Read Also : ‘ఎంత మంచివాడవురా’ జనవరి 15 ఫిక్స్

‘నవంబర్ 18 నాటికి చివరి షెడ్యూల్ పూర్తవుతుందని, విజువల్ ఎఫెక్ట్స్ పార్ట్ ఎక్కువగా ఉండడంతో క్వాలిటీ అవుట్‌పుట్ కోసం కాస్త లేటయినా పర్వాలేదని, డిసెంబర్ 1న డిస్కోరాజా టీజర్ రిలీజ్ చేస్తాం’ అని మేకర్స్ చెప్పారు. ఎస్.ఆర్.టి. బ్యానర్‌పై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ : థమన్, సినిమాటోగ్రాఫర్ : కార్తీక్ ఘట్టమనేని, ఎడిటింగ్ : నవీన్ నూలి, డైలాగ్స్ : అబ్బూరి రవి.

 

Related Posts