ఆడపిల్లలను పెంచేది మృగాళ్ల చేతిలో బలికావడానినేనా?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

vijayawada divya tejaswini murder case: న్యాయం కావాలి…ఎన్‌కౌంటర్ చేయాలి…దివ్యతేజస్విని తండ్రి డిమాండ్ ఇది..తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచుకునేది ఇలా మోసగాళ్లు, నేరగాళ్ల చేతిలో బలైపోవడానికా అంటూ దివ్య తండ్రి జోసెఫ్ ఆగ్రహం వ్యక్తం చేసారు.విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకానికి దివ్య బలైపోయిన ఉదంతంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండగా, ఆమె తండ్రి జోసెఫ్ మాటలు ఆవేదనకు గురి చేస్తున్నాయ్. దివ్య తల్లిదండ్రుల వాదన ప్రకారం అసలు నాగేంద్ర ఈ హత్య ఏదో క్షణికావేశంలో చేసింది కాదు. పక్కా వ్యూహం ప్రకారమే దివ్యని మర్డర్ చేశాడన్నది ఆవేదన. అందుకే దొంగచాటుగా ఇంట్లోకి వచ్చి, తలుపులు మూసేసి హత్య చేశాడు. ఎవరూ చూడకపోతే ఏమీ ఎరగనివాడిలా వెళ్లిపోయేవాడని, తాము చూడబట్టే, తనపై కూడా దాడి చేసుకున్నాడని దివ్యతల్లి కుసుమ ఆరోపిస్తున్నారు

చదువులో చలాకీ. ఉన్నత స్థితికి ఎదగాలనే ఆరాటం, టార్గెట్ ఉన్న దివ్య చివరికి ప్రేమోన్మాది ఘాతుకానికి బలైపోయింది. అందుకే ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ తమని వెంటాడుతున్నాయని దివ్య తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. అంతేకాదు. ఆడపిల్లలు లేని ఇల్లు ఉండదు. నా కూతురిని చంపిన నాగేంద్రకి జన్మనిచ్చింది కూడా ఓ స్త్రీనే అని. ఇలాంటి వాడిని వదిలేయకూడదంటూ ఆమె మండిపడిందిప్రేమిస్తే, కలసి బతకాలి. కానీ ఇలా చంపేస్తారా..? ఇదే ప్రశ్న అందరిలో..నిజంగా నాగేంద్రలోని ప్రేమ ఉంటే..కసిగా అన్నిసార్లు తమ కూతురిపై దాడి చేసేవాడు కాదని..కేవలం తాను కేసు నుంచి తప్పించుకునేందుకే ఈ డ్రామా ఆడుతున్నాడని దివ్య తల్లిదండ్రులు చెప్తున్నారు. దివ్య తాను ఇద్దరం చనిపోవాలనుకున్నట్లు హాస్పటల్ నాగేంద్ర చెప్పడం డ్రామా అని ఆరోపించారు. ఇది కూడా ఇప్పుడు సంచలనం కలిగించేదే.బోలెడంత ఆత్మవిశ్వాసం,ఎన్నో ఆశలు ఉన్న దివ్యతేజస్విని హత్యపై తల్లిదండ్రులు కుమిలిపోతుండగా, స్థానికంగా విషాద వాతావరణం నెలకొంది. నిందితుడు నాగేంద్రపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. అది తక్షణం జరగాలని లేదంటే తామూ సూసైడ్ చేసుకుంటామంటూ దివ్యపేరెంట్స్ ఆక్రోశించడం కలచివేస్తోంది.

Related Posts