సీఎం జగన్ ను కలిసిన దివ్య తేజస్విని తల్లిదండ్రులు, న్యాయం చేయాలని విన్నపం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

divya tejaswini: ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన విజయవాడ ఇంజినీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్విని తల్లిదండ్రులు ఏపీ సీఎం జగన్ ను కలిశారు. హోంమంత్రి సుచరితలో కలిసి వారు జగన్ ను కలిశారు. తమకు జరిగిన అన్యాయాన్ని దివ్య తల్లిదండ్రులు సీఎంకి వివరించారు. న్యాయం జరిగేలా చూడాలని కోరారు. నిందితుడు నాగేంద్రను కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు.

విజయవాడ ప్రేమోన్మాది ఘటనలో కొత్త ట్విస్ట్


విజయవాడ ఇంజినీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ప్రధాన నిందితుడు నాగేంద్ర కాల్ డేటాను పోలీసులు పరిశీలించారు. హత్యకు ముందు నాగేంద్ర తన స్నేహితులకు ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దివ్య తేజస్విని ఇంటికి తన స్నేహితులను రమ్మని నాగేంద్ర కోరాడు. దివ్య ఇంటికి వెళ్లేసరికి నాగేంద్ర రక్తపుమడుగులో ఉన్నాడని స్నేహితులు తెలిపారు. దివ్య కుటుంబసభ్యులతో పాటు చుట్టుపక్కల వారిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో వారంలోగా అభియోగపత్రం దాఖలు చేయాలని పోలీసులను డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశించారు.



Related Tags :

Related Posts :