లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Life Style

దీపావళి లోగా ఈ వస్తువులు పడేయండి

Published

on

Diwali 2019 Drop these items Fastly

దీపావళి అంటే దీపాల పండుగ. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా అందరూ ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగ దీపావళి. అంతేకాదు ఆ రోజు లక్ష్మీదేవి పుట్టినరోజు కూడా.. అందరూ ఆ రోజు పొద్దున్నే ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేసి లక్ష్మీదేవిని పూజిస్తారు. అయితే మీకు తెలియని విషయం ఏమిటంటే.. లక్ష్మీదేవికి పూజ మాత్రమే చేస్తే సరిపోదు. ఇంట్లోని పనికిరాని వస్తువులను కూడా బయడపడేయాలి. అదేంటి అనుకుంటున్నారా..? 

ఎందుకంటే ఆ రోజు లక్ష్మీదేవి పుట్టినరోజు. ఆమె పుట్టినరోజు సందర్భంగా విష్ణుమూర్తి నీకేం కావాలో కోరుకోమని అడిగితే.. నేను భూలోకానికి నేరుగా వెళ్ళి అంతా చూడాలి అని కోరుకుందట. ఇందుకు విష్ణుమూర్తి ఆమెను వెళ్లమని చెప్పాడు. అప్పటినుంచి ప్రతి దీపావళి రోజు లక్ష్మీదేవి స్వయంగా భూలోకానికి వస్తుందట. అయితే లక్ష్మీదేవికి శుభ్రంగా వున్న ఇల్లు అంటే చాలా ఇష్టం. అలా అని ఇంటిని మాత్రమే శుభ్రం చేసుకోవడం కాదు.. పనికిరాని వస్తువులను కూడా ఇంట్లో ఉంచకూడదట. అలా ఉంటే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. 
 
ఇంట్లో ఉండకూడని వస్తువులు:
> ఇంట్లో పగిలిన అద్దం ఉంచితే ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండటమే కాకుండా మనస్ఫర్థలు వస్తాయి. 
> విరిగిన మంచం కూడా ఉంచకూడదు. ఒకవేల మంచం కాస్త విరిగి శబ్దాలు వస్తున్నవి ఏమైన ఉంటే వాటిని బాగు చేయించాలి. 
> ఆగిపోయిన గడియారం లేదా విరిగిన గడియారం గానీ ఉంటే పడేయాలి.. లేదంటే ఏ పని మొదలెట్టినా ఆటంకాలు వస్తాయి. 
> చెద పట్టిన ఫోటోలు కూడా బయట పడేయాలి. అంతేకాదు ఇంటి ముఖ ద్వారానికి రిపేర్లు ఉంటే చేయించాలి. 
> చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలు విరిగిపోయి వుంటే వాటిని కూడా పడవేయాలి. చిరిగిన బట్టలు పడవేయాలి. 
గత యేడాది వాడిన దీపాలను మళ్ళీ వాడకూడదు. కొత్త దీపాలను కొనుగోలు చేసి దీపావళిని చేసుకుంటే మహాలక్ష్మి కటాక్షిస్తుంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *