Diwali bonus for Singareni workers

తీపి కబురు : సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సింగరేణి కార్మిలకు దీపావళి బోనస్ అందించాలని యాజమాన్యం నిర్ణయించింది. సంస్థ ఉద్యోగులకు ప్రతిభ ఆధారిత ప్రయోజనం (PLR) బోనస్‌ను ప్రతి సంవత్సరం దీపావళఇ పండుగ కంటే ముందు..అంటే..పది రోజుల ముందే చెల్లిస్తారు. ఈసారి కూడా అలాగే చేయాలని, అక్టోబర్ 25వ తేదీన బోనస్ ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 27వ తేదీ దీపావళి పండుగ సమీపిస్తుండడం, ఎప్పుడు చెల్లిస్తారో తెలియకపోవడంతో కార్మికుల్లో ఆందోళన వ్యక్తమైంది. నవంబర్ నెలలో చెల్లిస్తారని ప్రచారం జరిగింది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో కార్మికుల్లో సంతోషం వ్యక్తమైంది.

సింగరేణి వ్యాప్తంగా 48 వేల మంది కార్మికులకు ఈ బోనస్‌ను పంపిణీ చేయనున్నారు. అక్టోబర్ నెలలోనే లాభాల వాటా కింద రూ. 494 కోట్లు పంపిణీ చేశారు. దీంతో దీపావళి బోనస్ చెల్లింపులో కొంత ఆర్థిక ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా..బోనస్ చెల్లించాలని యాజమాన్యం తాజాగా నిర్ణయం తీసుకుంది. గత సంవత్సరం రూ. 60 వేల 500 చొప్పున చెల్లించగా..ఈసారి దాన్ని రూ. 64 వేల 700కు పెంచుతూ గత నెలలో జాతీయ కార్మిక సంఘాలు చేసుకున్న ఒప్పందంలో నిర్ణయం తీసకున్నారు. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా బోనస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సింగరేణి కార్మికులకు దసరా పండుగ సందర్భంగా బోనస్ ప్రకటించారు సీఎం కేసీఆర్. సెప్టెంబర్ 19వ తేదీ గురువారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన చేశారు. 2019 సంవత్సరంలో…లాభాల్లో వాటాను 28 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. దీనివల్ల లక్షా 899 రూపాయల బోనస్ వస్తుందని ప్రకటించారు సీఎం కేసీఆర్. గత ఏడాది కన్నా 40 వేల 530 రూపాయలు అదనంగా ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. 
Read More : బండ్ల గణేష్ అరెస్ట్

Related Posts