లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా జకోవిచ్

Publish Date - 6:40 pm, Sun, 21 February 21

DJocovic wins Australian Open tennis championship

Australian Open tennis championship : ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ చాంపియన్ షిప్‌లో జకోవిచ్ విజేతగా నిలిచాడు. మెల్బోర్న్ లో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో సెర్బియా క్రీడాకారుడు జకోవిచ్ వరుస సెట్లలో డానిల్ మెద్వెదెవ్‌ను ఓడించాడు. 7-5, 6-2, 6-2 తో ప్రత్యర్థిని చిత్తుచేసి ఆస్ట్రేలియన్ ఓపెన్ చరిత్రలో అత్యధిక టైటిళ్లు గెలిచిన క్రీడాకారుడిగా తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. 9వ సారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. మొత్తంగా ఇది జకోవిచ్ కు కెరీర్ లో 18వ గ్రాండ్ స్లామ్ టైటిల్.

అద్భుత ఆటతీరుతో ఫైనల్ వరకు దూసుకొచ్చిన పాతికేళ్ల రష్యా కుర్రాడు మెద్వెదెవ్ టైటిల్ సమరంలో జకోవిచ్ అనుభవం ముందు నిలవలేకపోయాడు. తొలి సెట్లో మాత్రం కాస్త గట్టిపోటీ ఇచ్చినట్టు కనిపించిన మెద్వెదెవ్ చివరి రెండు సెట్లలో తేలిపోయాడు.

బలమైన సర్వీసులు, పదునైన ఫోర్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్ షాట్లతో విజృంభించిన జకోవిచ్‌ను అడ్డుకోలేకపోయాడు. ఈ విజయంతో జకోవిచ్‌కు ట్రోఫీతో పాటు రూ.15 కోట్ల వరకు నగదు బహుమతి అందుకోనున్నాడు.