Home » Chennai Super Kings జట్టు Dhoni పద్ధతిని పక్కకు పెట్టాల్సిందేనా..?
Published
4 months agoon
By
subhnఈ సీజన్లో Chennai Super Kings ప్రతి ఓటమి Dhoni పద్ధతిలో ఆడిందే. శుక్రవారం జరిగిన మ్యాచ్ లోనూ రవీంద్ర జడేజా, శామ్ కరన్, డేన్ బ్రావోలను లోయర్ ఆర్డర్లో దింపాడు. జడేజా హాఫ్ సెంచరీ చేశాడు. జడేజా 138, బ్రావో 157, కరన్ 187 స్ట్రైక్ రేట్ తో ఆడారు. నిజానికి వారంతా ఆ పొజిషన్లో బ్యాటింగ్ చేయాల్సిన వారేనా.. ముందు బ్యాటింగ్ చేస్తే మరిన్ని పరుగులు వచ్చేవి కాదా..
సూపర్ కింగ్స్ టాపార్డర్ పెద్దగా సాధించకుండా అంతా లోయర్ ఆర్డర్, ధోనీ మీదకు వదిలేస్తుంది. ఇవే చేధనల్లో విఫలమై మూడు వరుస ఓటములకు కారణమవుతున్నాయి. సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ ఫ్లెమింగ్.. సీజన్ ఆరంభంలో మాట్లాడుతూ.. ఈ IPL సీజన్ ను ఎవరూ అలవాటు చేసుకోగలిగితే వారే మంచి బ్యాటింగ్ చేయగలరని అన్నాడు. మరి సూపర్ కింగ్స్ చక్కటి బ్యాటింగ్ స్ట్రాటజీ ఫాలో అవలేకపోతుందా..
Garg ఒంటరిపోరాటం:
సన్రైజర్స్ బ్యాటింగ్ సమయంలో కేన్ విలియమ్సన్ రనౌట్ అయిపోగా స్కోరు అంచనాను బట్టి.. 132 పరుగులు చేయగలదని భావించారు. కానీ, అది కాస్తా ప్రియం గార్గ్ హిట్టింగ్ వల్ల 165కు చేరుకోగలిగింది. అభిషేక్ శర్మతో కలిసి అద్భుతమైన పార్టనర్షిప్ నెలకొల్పి 23బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
గార్గ్ నెట్స్ లో భువనేశ్వర్ బౌలింగ్ ను ప్రాక్టీస్ చేశాడు. 2018లో ఉత్తరప్రదేశ్ నుంచి రంజీ ట్రోఫీలో ఆడాడు. అండర్-19 వరల్డ్ కప్ టోర్నీలో దక్షిణాఫ్రికాతో ఆడిన జట్టులో గార్గ్ ఉన్నాడు. గతేడాది ఐపీఎల్ వేలంలో సన్రైజర్స్ రూ.1.9కోట్లకు కొనుగోలు చేసింది.
ఫీల్డ్ కు అనుగుణంగానే చేసిన గార్గ్ హిట్టింగ్ తో పరుగుల వరద పారింది. కరన్ అవుట్ సైడ్ ఆఫ్ లో బౌలింగ్ చేసినా.. గార్గ్ డీప్ పాయింట్ లో ఎవరూ లేరని గమనించి హిట్టింగ్ చేశాడు. బ్రావో యార్కర్ బౌలింగ్ చేసినప్పుడు షార్ట్ ఫైన్ లెగ్ తో హిట్టింగ్ చేశాడు. అంతేకాకుండా సీజన్లో సూపర్ కింగ్స్ బెస్ట్ బ్యాట్స్మన్ అయిన డుప్లెసిస్ ను కూడా రనౌట్ చేశాడు.
డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ Bravo ముందే బౌలింగ్ చేయడం:
ఆశ్చర్యకరంగా ధోనీ.. బ్రావోను ఏడో ఓవర్లోనే బౌలింగ్ చేయించారు. 2015 నుంచి ఆడిన 825 టీ20 ఓవర్లలో బ్రావో కేవలం 13 సార్లు మాత్రమే ఏడో ఓవర్లో బౌలింగ్ చేశాడు. గత రెండు ఐపీఎల్ ఎడిషన్స్ లో బ్రావో డెత్ ఓవర్లలోనే బౌలింగ్ చేశాడు. నిజానికి ఈ ఐపీఎల్ లో బ్రావో శుక్రవారం ఫస్ట్ మ్యాచ్ ఆడాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో అయిన మోకాలి గాయం నుంచి కోలుకుని రావడంతో ధోనీ ఏడు, పదో ఓవర్లో బౌలింగ్ చేయించాడు.
— Chennai Super Kings (@ChennaiIPL) October 2, 2020
మరోవైపు వాట్సన్ తాహిర్ లను మార్చాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. 1, 14, 33, 4 ఇది వాట్సన్ ప్రస్తుత సీజన్ స్కోరు: 2019లోనూ ఫెయిల్ అవుతూనే వచ్చాడు.