సీఎం జగన్ గారు న్యాయం చేయండి, నాగేంద్రను ఎన్ కౌంటర్ చేయండి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Do justice Divya Tejaswini : సీఎం జగన్ గారు..న్యాయం చేయండి. తన కూతురును చంపేసిన నాగేంద్రను ఉరి శిక్ష లేదా, ఎన్ కౌంటర్ చేయాలని కోరారు దివ్య తేజస్విని తండ్రి జోసెఫ్. ప్లాన్ ప్రకారమే నాగేంద్ర హత్య తన బిడ్డచేశాడని, ఇంత దారుణానికి పాల్పడ్డ నాగేంద్రను ఎన్‌కౌంటర్‌ చేయాల్సిందేనని అన్నాడు. దివ్యను నాగేంద్ర ప్రేమించానని చెబుతున్న మాటల్లో నిజం లేదన్నాడు.ఎవరైనా ప్రేమిస్తే 13 కత్తి పోట్లు పొడుస్తాడా అని ప్రశ్నించారు. విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకున్న తన బిడ్డ నాగేంద్ర కిరాతకానికి బలైపోయిందన్నాడు. నాగేంద్రతో దివ్య పెళ్లి వాస్తవం కాదన్నాడు. నాగేంద్రకు ఎవరెవరు సహకరించారో పోలీసుల విచారణలో బయటపడుతుందన్నాడు జోసెఫ్. తన కూతురిని దారుణంగా హత్య చేసిన నాగేంద్రను హత్య చేయాలంటున్నారు ఆమె తండ్రి జోసఫ్‌… తన కూతుర్ని చంపి తాను మాత్రం బతికిపోయాడన్నారు. పక్కా పథకం ప్రకారమే ఇంటి గోడను దూకి వచ్చాడన్నారు.

దివ్య హత్య ప్లాన్‌ ప్రకారం జరిగిందన్నాడు దివ్య సోదరుడు దినేశ్‌. దివ్య మెంటల్‌గా చాలా స్ట్రాంగ్ అన్నాడు. సోషల్ మీడియాలో వేధింపుల గురించి ఎప్పుడు చెప్పలేదన్నాడు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరాడు.దారుణంగా కత్తిపోట్లకు గురై.. చనిపోయిన దివ్య తేజస్విని కుటుంబ సభ్యులను హోంమంత్రి మేకతోటి సుచరిత పరామర్శించనున్నారు. 2020, అక్టోబర్ 17వ తేదీ శనివారం మధ్యాహ్నం దివ్య ఇంటికి వెళ్లనున్న ఆమె.. హత్య ఎలా జరిగింది? అందుకు గల కారణాలను అడిగి తెలుసుకోనున్నారు.సోషల్‌ మీడియా వేదికగా దివ్య తేజస్విని తాను పడుతున్న బాధను పంచుకుంది. దాదాపు 29నిమిషాల వీడియోలో తన ఫీలింగ్స్ చెప్పింది. తన వేదన, ఆవేదన, బాధను వెళ్లగక్కింది. తాను రెండున్నరేళ్లు ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నానని, అతని వేధింపులు భరించలేక విడిపోయామని చెప్పింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు చెబితే.. వారు తనకు ధైర్యం చెప్పారని తెలిపింది. విడిపోయిన తరువాత.. దాదాపు 7 నెలలుగా ఓ సైకో తనను టార్చర్ చేస్తున్నానని, మానసికంగా కృంగిపోయేలా చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది.

Related Posts