లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story-1

ఫాదర్ స్టాన్ స్వామికి సౌకర్యాలు కల్పించలేము… ఎన్ఐఏ

Published

on

Do not have a straw and sipper to give Stan Swamy : మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అరెస్టైన ఫాదర్ స్టాన్ స్వామికి(84) ఇవ్వటానికి తమ వద్ద స్ట్రా, సిప్పర్ లేవని జాతీయ దర్యాప్తు సంస్ధ అధికారులు ప్రత్యే ఎన్ఐఏ కోర్టుకు తెలిపారు. శీతాకాలంలో…. 84 ఫాదర్ స్వామికి చలికి తట్టుకునేందుకు ఉన్ని దుస్తులు, స్ట్రా, సిప్పర్ వంటి సౌకర్యాలు కల్పించే విషయమై నివేదిక ఇవ్వమని కేసు విచారిస్తున్న ప్రత్యేక న్యాయస్ధానం జడ్జి డీఈకొథాలికర్, వైద్యాధికారులను ఆదేశించారు.

ఈ కేసు డిసెంబర్ 4న విచారణకు రానుంది. నవంబర్ 6న ఫాదర్ స్వామి తనకు పార్కినసన్ వ్యాధి ఉన్నందున గ్లాసు కూడా  పట్టుకోలేకపోతున్నానని ….తలోజా జైలులో  మంచినీళ్లు,టీ తాగేందుకు స్ట్రా,సిప్పర్ ఇవ్వాలని కోరుతూ ఒక పిటీషన్ దాఖలు చేశారు.కాగా.. అక్టోబర్ 22న కోవిడ్ వైరస్ వ్యాప్తి నేపధ్యంలో ఖైదీలక మధ్యంతర బెయిల్ ఇచ్చి విడుదల చేయాటానికి ఏర్పాటు చేసిన హై పవర్ కమిటీ ఫాదర్ స్టాన్ స్వామి పిటీషన్ ను తిరస్కరించింది. చట్టవిరుధ్దమైన కార్యకలాపాల నివారణ చట్టం ప్రకారం శిక్షార్ఙమనైన నేరానికి ఫాదర్ స్వామి పాల్పడినందును మధ్యంతర బెయిల్ కు అనర్హుడని పేర్కోంది.ఫాదర్ స్వామి పార్కిన్ సన్ వ్యాధితో బాధ పడుతున్నారని, వినికిడి శక్తి కూడా కోల్పోయారని కనుక మధ్యంతర బెయిల్ ఇవ్వాలని స్వామి తన పిటీషన్ లో  కోరారు. అనేక సార్లు జైలులో పడిపోయారని. హెర్నియాకు రెండు సార్లు ఆపరేషన్ చేయించుకున్నారని, అప్పుడప్పుడు కడుపులో నొప్పి వస్తుంటుందని అందువల్ల కోవిడ్ నుంచి రక్షణకోసం స్వామికి మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని స్వామి పిటీషన్లో లాయర్ కోరారు.

ఢిల్లీ, హర్యానా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత..రైతులపై బాష్పవాయు గోళాలు ప్రయోగించిన పోలీసులు


కాగా.. పిటీషనర్ వృధ్దుడు కనుక అతడ్ని జైలులోని ఆస్పత్రిలో ప్రత్యేక వార్డులో ఉంచామని, ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే ప్రత్యేక చికిత్స అందిస్తామని తలోజా జైలు సూపరింటెండెంట్ చెప్పారు.ఫాదర్ స్వామి 2018 భీమా కోరెగావ్ కేసులో నిందితుడు. రాంచీలోని అతని నివాసం నుంచి అక్టోబర్ 8వ తేదీన తీవ్ర ఉద్రిక్తతల మధ్య స్వామిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసి మరుసరిరోజు ముంబై తీసుకు వచ్చారు. అక్టోబర్ 9నుండి ఫాదర్ స్వామి జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్నారు.


Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *