లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Health

కరోనాను అడ్డుకునే పవర్‌ఫుల్ డ్రగ్ వచ్చేసింది!

Published

on

Bamlanivimab Drug to Prevent Covid : ప్రపంచాన్ని వణికించిన కరోనావైరస్ మహమ్మారిని నిర్మూలించే కరోనా వ్యాక్సిన్లు వచ్చేశాయి. ప్రపంచమంతంటా వ్యాక్సినేషన్ కూడా ప్రారంభమైంది. ఇంకేముంది.. మనదగ్గర వ్యాక్సిన్ ఉన్నట్టేగా అంటారా?  కరోనా వ్యాక్సిన్ ఎంతవరకు సురక్షితం.. సమర్థవంతం వంటి అనేక సందేహాలు లేకపోలేదు. అయినప్పటికీ కరోనా వ్యాక్సిన్లు సమర్థవంతమైనవే అంటూ డ్రగ్ మేకర్లతో పాటు పలు అధ్యయనాలు కూడా తేల్చేశాయి. అమెరికాలో కరోనా నివారణకు వాడిన యాంటీబాడీల డ్రగ్ ఒకటి.. వైరస్‌ను సమర్థవంతంగా అడ్డుకోగలదని నిరూపితమైంది. వ్యాక్సిన్ల కంటే వేగంగా ఈ యాంటీబాడీ డ్రగ్ కరోనాను అడ్డుకోగలదని అధ్యయనాలు చెబుతున్నాయి.

అమెరికాలో కరోనా నివారణకు డ్రగ్‌పై జరిగిన అసాధారణమైన ప్రయోగంగా చెప్పవచ్చు. ఈ పరిశోధన కోసం మొబైల్ ల్యాబ్‌లతో కూడిన వాహనాల్లో వైద్య సిబ్బంది నర్సింగ్‌హోమ్‌ల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. హెల్త్ వర్కర్లకు (bamlanivimab) అనే  యాంటీబాడీ డ్రగ్ అందించారు. ఇందుకోసం తాత్కాలిక ఇన్ఫ్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ డ్రగ్‌లో మోనోక్లోనల్ యాంటీబాడీస్ కలిగి ఉంటుంది.

నర్సింగ్ హోమ్ సిబ్బంది, వైరస్ బారిన పడిన నివాసితులలో ఇన్ఫెక్షన్లను నివారించడానికి ఈ ఔషధాన్ని కనుగొన్నారని డ్రగ్ మేకర్ Eli Lilly ప్రకటించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ భాగస్వామ్యంతో నిర్వహించిన అధ్యయనంలో ప్రాథమిక ఫలితాల ప్రకారం.. ఇందులో వృద్ధులపై అధిక ప్రభావం ఉంటుందని అంటున్నారు. ఔషధాన్ని పొందిన వారిలో 80శాతం అంటువ్యాధులు తగ్గినట్టు పరిశోధకులు కనుగొన్నారు. అలాగే ప్లేసిబో పొందిన వారితో పోలిస్తే.. సిబ్బందిలో 60శాతం తగ్గుదల ఉన్నట్టు నిర్ధారించారు.

అధ్యయనంలో మొత్తం 965 మంది పాల్గొనగా.. వారిలో 666 మంది వైద్య సిబ్బంది, 299 మంది నివాసితులు ఉన్నారు. కానీ, ప్లేసిబో తీసుకున్నవారిలో నలుగురు మరణించారు. Bamlanivimab యాంటీబాడీ డ్రగ్‌కు ఇప్పటికే యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అత్యవసర వినియోగానికి అనుమతి ఉంది. చాలా మంది నర్సింగ్ హోమ్ వర్కర్లు టీకాలకు భయపడిపోతున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయోమనన్న భయంతో టీకాలను తీసుకునేందుకు నిరాకరించారు.

టీకాలు వేసిన తరువాత, శరీరంలో తగినంత యాంటీబాడీలు ఉత్పత్తి చేయడానికి ఆరు వారాలు సమయం పట్టవచ్చని రీసెర్చర్లు అంచనా వేస్తున్నారు. మోనోక్లోనల్ యాంటీబాడీలు కలిగిన ఈ Bamlanivimab మందు కూడా టీకా ఇచ్చేంత దాదాపు సమానమైన ప్రొటెక్ట్ వెంటనే ఇవ్వగలదని అంటున్నారు. కానీ, టీకా రక్షణ ఇచ్చినంత కాలం ఈ డ్రగ్ ఇవ్వలేదని చెబుతున్నారు.