Do You Actually Need That Protein Shake After Gym? Here's The Science

Gym చేశాక నిజంగా ప్రొటీన్లు అవసరమా? సైన్స్ ఏం చెబుతోంది?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

శరీరానికి వ్యాయమం ఎంతో అవసరం.. ఫిట్ గా ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయడం మంచిది. రోజు వ్యాయామం చేసేవారు ఆరోగ్యంతో పాటు ఎంతో ఉత్సాహంగా కనిపిస్తారు. కొంతమంది అసలే వ్యాయామం చేయరు. ఫలితంగా తరచూ అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. మరికొంతమంది అవసరం ఉన్నా లేకున్నా పరిమితికి మించి వ్యాయామం చేస్తుంటారు.

దేహాన్ని బలిష్టంగా ఉంచుకోవడానికి జిమ్ లకు వెళ్లి గంటల తరబడి కసరత్తులు చేస్తుంటారు. సాధారణంగా బాడీబిల్డర్లే ఎక్కువగా ప్రోటీన్లు తీసుకుంటారు. శరీర ఆకృతిని తమకు నచ్చిన విధంగా మార్చుకోవడానికి ఎన్నో ప్రోటీన్లను శిక్షణలో తీసుకుంటారు. ఇప్పుడు బాడీ బిల్డర్లే కాదు.. చాలామంది శరీర ఆకృతి కోసమమని, మంచి ఫిట్ నెస్ కావాలంటూ ఎన్నో రకాల ప్రోటీన్లను తీసుకుంటున్నారు. 

ప్రోటీన్ల కంపెనీలకు ఫుల్ గిరాకీ :
స్పోర్స్స్ సప్లిమెంట్స్ అధికంగా తీసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఫిట్ నెస్ కోసం ప్రోటీన్లను ఉత్పత్తి చేసే పరిశ్రమలకు భారీ గిరాకీ పెరుగుతోంది. ప్రోటీన్ షేక్స్, పౌడర్స్, బార్స్, పిల్స్ ఎన్నోకంపెనీల పేర్లతో మార్కెట్లలో లభ్యమవుతున్నాయి. జిమ్ కు వెళ్లేవారిలో చాలామంది సగటున ఇలాంటి ప్రోటీన్లపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు.

అదనపు ప్రోటీన్లు అవసరమా? :
వాస్తవానికి.. ఫిట్ నెస్ కోసం ఇలాంటి ప్రోటీన్లు శరీరానికి అవసరమా? అనేదానిపై ఇటీవల ఓ అధ్యయనం కొన్ని అంశాలను వెల్లడించింది. రెగ్యులర్ గా జిమ్ కు వెళ్లేవారిలో సగానికి పైగా ఈ ప్రొటీన్ సప్లిమెంట్స్ శిక్షణలో భాగంగా తీసుకుంటున్నట్టుగా అధ్యయనం తెలిపింది. కానీ, ఈ ప్రోటీన్ ఒక అవసరమైన పోషకమైతే.. అది లేకుండా జీవించలేమా? ఈ సప్లిమెంట్స్ అవసరం లేకుండా ఉండగలమా? అంటే నమ్మశక్యంగా లేదుకదా?.. 
muscle increase

ప్రోటీన్.. అనేది అవసరమైన పోషకం.. ఇది లేకుండా జీవించలేం. మన శరీరంలోని ప్రతి కణం.. ప్రోటీన్ తో కూడి ఉంటుంది. ఆయా ప్రోటీన్లతో శరీరంలోని కణజాలాలను నిర్మించుకోవడం, రిఫేర్ చేసుకోనేందుకు వినియోగిస్తుంటుంది. శక్తి ద్వారా ఉత్పన్నమయ్యే ప్రోటీన్లతో హార్మోన్లు, ఎంజైమ్ లను ఉత్పత్తి చేసుకోవచ్చు. శరీరంలో ప్రోటీన్లను ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం కూడా ఉంది. ప్రత్యేకించి ప్రోటీన్లను శరీరానికి అందించాల్సిన అవసరం పెద్దగా ఉండదు.

ఎవరికైనా ప్రోటీన్ల స్థాయి తగినంతగా లేనివారికే వైద్యుని సలహా మేరకు మోతాదుతో ప్రోటీన్లను రికమండ్ చేస్తుంటారు. జిమ్ చేశాక.. చాలామంది ఈ ప్రోటీన్లను తీసుకుంటుంటారు. కండరాలను పెంచుకోవడం కోసం కొంతమంది వాడితే, బరువు తగ్గేందుకు మరికొంతమంది వాడుతుంటారు. జిమ్ చేసే వారిలో చాలామంది తమ కండరాల (మజిల్) అభివృద్ధి, బలిష్టంగా కనిపించేలా చేసేందుకు అధిక మోతాదులో ఈ ప్రోటీన్లను తీసుకుంటుంటారు. 

READ  కిక్కుదించేస్తారట : వైన్ షాపులు..బార్లపై సీఎం జగన్ కీలక నిర్ణయం

ప్రోటీన్లు ఎలా? ఎంత మోతాదు తీసుకోవాలి? :
అది కూడా తమ వ్యాయామ విధానంలో భాగంగానే మోతాదుతో తీసుకుంటారు. ఎన్నో ఏళ్లుగా శాస్త్రవేత్తలు సైతం.. ప్రోటీన్లను ఎంత మోతాదులో తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి ఎలా (నీటిలో కలిపి ప్రోటీన్ షేక్స్ తీసుకోవడం) అనేదానిపై చర్చలు జరిపారు. సాధారణ వ్యక్తుల కంటే జిమ్ చేసే వారు ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ల అవసరం ఉంటుంది. అంతేకాదు.. వారి శిక్షణ తీవ్రత, వారి లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. కానీ, ప్రతిఒక్కరూ అధిక స్థాయి ప్రోటీన్ డైట్ తీసుకోవాల్సిన అవసరం లేదు.
Strength power

ఒక వ్యక్తి 70 కిలోల బరువు (154 పౌండ్స్) ఉంటే.. వారు రోజుకు 56 గ్రాములు (2 ఔన్సుల) ప్రోటీన్లు (ఒక కిలోకు 0.8 గ్రాముల ప్రోటీన్) తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ, ఎవరైతే జిమ్ శిక్షణ తర్వాత తమ ఫిట్ నెస్, హెల్త్, శరీర ఆకృతి, బరువు తగ్గడం వంటి వేగంగా ఉండాలంటే మాత్రం.. 70 కిలోల బరువు ఉన్న వ్యక్తి.. రోజుకు ఒక కిలోకు 1.4 గ్రాముల నుంచి 2 గ్రాముల వరకు ప్రోటీన్లు తీసుకోవాలని ఫిట్ నెస్ నిపుణులు సూచిస్తున్నారు. అంటే.. మొత్తంగా 98 గ్రాముల నుంచి 140 గ్రాములు (3.4 నుంచి 5 ఔన్సులు) ప్రోటీన్లు తీసుకోవాల్సి ఉంటుంది. తద్వారా శరీరంలో దెబ్బతిన్న కణజాలలు పునరుత్తేజం చెంది అతిత్వరగా రికవరీ అయ్యేందుకు సాయపడుతుంది. 

కండరాలు బలంగా పెరగాలంటే :
కండరాల పెరుగదల కోసం జిమ్ లో శిక్షణ తీసుకునే వ్యక్తి ఎంత మోతాదులో ప్రోటీన్లు తీసుకోవాలి అనేదానిపై సైంటిస్టులు పరిశోధనల ప్రకారం.. మజిల్ బలిష్టంగా తయారు కావాలంటే ఆ వ్యక్తి 20 నుంచి 25 గ్రాములు (0.7 ఔన్సులు) ప్రోటీన్లు తీసుకోవాలి. అంటే.. ఒక స్పూన్ ప్రోటీన్ పౌడర్లకు సమానం లేదా లీన్ చికెన్ బ్రెస్ట్ లో లభించే 100 గ్రాముల లేదా 3.5 ఔన్సుల ప్రోటీన్లు ఉండాలి. ఇలా చేస్తూ పోతే కండలు తిరిగిన బాడీని సొంతం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు.
bodybuilder

ఒక సిట్టింగ్ డైట్ లో 20 గ్రాముల కంటే ఎక్కువగా ప్రోటీన్లు తీసుకున్నా వృథా కాదని అంటున్నారు. ప్రత్యేకించి మీరు ఏదైనా ఫుడ్ తినాలని అనుకుంటే.. ఆ రోజుంతా కేవలం ప్రోటీన్ షేక్స్ తాగడం చేయొద్దు. అంతేకాదు.. ఒక కిలోకు 0.25 గ్రాముల ప్రోటీన్లు తీసుకోవడం లేదా ఒక భోజనానికి 20 నుంచి 40 గ్రాముల ప్రోటీన్లు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కండరాలు పెరగడానికి ప్రోటీన్లు తీసుకోవడం ఒక్కటే మాత్రమే కారణం కాదు.. క్యాలరీ కంట్రోల్డ్ డైట్ లో భాగంగా ప్రోటీన్ సప్లిమెంట్స్ కూడా బరువు తగ్గడంలో మెరుగైన ఫలితాలను చూపించాయి.  

READ  బార్లు ఓపెన్..ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే

Related Posts