Do you know which districts no corona cases?

కరోనా కేసులు లేని జిల్లాలు ఏవో తెలుసా

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా భారతదేశాన్ని గజగజ వణికిస్తోంది. వేల సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయి. ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో కేసులు తక్కువగా రికార్డవుతున్నాయి. జనాలు ఎక్కువగా తిరుగుతున్న ప్రాంతాల్లోనే వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. అంటే..పట్టణ ప్రాంతాల్లోనే అన్నమాట. ఇందుకు ఉదాహరణ..350 డిస్ట్రిక్స్ లో అసలు కేసులు లేకపోవడమే.

ఇది ఒకింత ఊపిరిపీల్చుకున్న వార్తే. 70కి పైగా జిల్లాలో కేవలం ఒకే ఒక్క కేసు నమోదు కావడం. 148 జిల్లాల పరిధిలో 10కి మించి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లక్ష ద్వీప్, దాద్రానగర్, సిక్కిం ఒక్క కేసూ నమోదు కాలేదు. బెంగళూరు, కోల్ కతాలలో కరోనా వైరస్ స్పీడుగా వ్యాపిస్తోంది. 

ఏ రాష్ట్రాల్లో ఎలా ఉందంటే : –
తెలంగాణ : వరంగల్ గ్రామీణం, వనపర్తి, మంచిర్యాల, నారాయణపేట, యాదాద్రి భువనగిరిల్లో కేసులు లేవు. అత్యధికంగా హైదరాబాద్ లో కేసులు నమోదవుతున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ : విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కేసులు లేవు. గుంటూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. 
 

తమిళనాడు : చెన్నై, కోయంబత్తూరులో ఎక్కువగా కేసులున్నాయి. 
కేరళ : వైరస్ ను వ్యాపించకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. 63 శాతం కాసరగోడు, కన్నూరు జిల్లాలో నమోదయ్యాయి. 
బీహార్ : 38 జిల్లాలో 11 జిల్లాలో వైరస్ విస్తృతంగా వ్యాపించింది. సివాన్ జిల్లాలో 29 కేసులు రికార్డ్ అయ్యాయి. 
ఒడిశా : 30 జిల్లాలో 9 జిల్లాలో కరోనా ఉంది. ఖుర్దా జిల్లాలో ఎక్కువగా కేసులున్నాయి,
 

రాజస్థాన్ : రాజధాని జైపూర్ లో ఎక్కువగా వైరస్ కేసులు బయటపడుతున్నాయి. 
గుజరాత్ : వడోదర, అహ్మదాబాద్ లలో 74 శాతం కేసులు రికార్డయ్యాయి. 
ఉత్తర్ ప్రదేశ్ : ఢిల్లీకి సమీపంలో ఉండే..గౌతమ్ బుద్ధ నగర్, మేరఠ్, ఆగ్రాలో అత్యధికంగా కేసులున్నాయి. 75 జిల్లాలో 43 చోట్ల వైరస్ లక్షణాలు బయటపడుతున్నాయి. 
మహారాష్ట్ర : 83 శాతం కేవలం ముంబై, పూణే నగరాల్లో వైరస్ వ్యాపించింది. 
మధ్యప్రదేశ్ : భోపాల్, ఇండోర్ హాట్ స్పాట్ లుగా కేంద్రీకృతమయ్యాయి. 
 

కర్నాటక : 19 డిస్ట్రిక్స్ లో మాత్రమే వైరస్ వ్యాపించింది. బెంగళూరు, మైసూరు, బెళగావి, బీదర్, దక్షిణ కన్నడ జిల్లాలో పదుల సంఖ్యలో కేసులున్నాయి. 
ఝార్ఖండ్ : 24 జిల్లాలకు 5 జిల్లాలో విస్తరించింది. రాంచీ, ఉక్కు నగరం బొకారాల్లో 83 శాతం కేసులు రికార్డవుతున్నాయి. 
పశ్చిమ బెంగాల్ : 8 జిల్లాలకే కరోనా వైరస్ వ్యాపించింది. 4 జిల్లాలో కేవలం ఒకే ఒక్క కేసు ఉంది. మిగతా మూడు జిల్లాలో 3 నుంచి 5 కేసులున్నాయి. 
ఉత్తరాఖండ్ :  13 జిల్లాలకు 6 జిల్లాలో కేసులున్నాయి. ఈ రాష్ట్ర రాజధాని డెహ్రడూన్ అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. 
ఛత్తీస్ గడ్ : 28 జిల్లాలకు 5 జిల్లాలకు వైరస్ విస్తరించింది. కోర్బా జిల్లాలో 74 శాతం కేసులున్నాయి. రాజధాని రాయ్ పూర్ లో 5 కేసులున్నాయి. 
 

READ  తెలంగాణలో కొత్తగా 1478 కరోనా కేసులు... ఏడుగురు మృతి

Related Posts