లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

హార్ట్ టచ్చింగ్ వీడియో : చిన్నారి క్యాన్సర్ పేషెంట్ కోసం బ్యాట్ మెన్ గెటప్ వేసుకున్న డాక్టర్

Published

on

Doctor Dresses Up Batman Cancer Patient’s Dream : చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు. అలాగే రోగులకు ప్రాణం పోసే డాక్టర్లను కూడా దేవుడితో సమానంగా భావిస్తాం. ఎంతోమంది డాక్టర్లు తమ వృత్తిని దైవంగా భావిస్తుంటారు. అటువంటి డాక్టర్లు రాత్రి పగలు తేడా లేకుండా రోగులకు సేవలు చేస్తుంటారు. ఈక్రమంలో రోగులకు ధైర్యం కూడా చెబుతుంటారు. అదే చిన్నపిల్లలైతే వారిని లాలించి బుజ్జగించి వైద్యం చేస్తారు. పిల్లల కోసం డాక్టర్లు చిన్నపిల్లల్లా మారి వారికి ట్రీట్ మెంట్ చేస్తుంటారు.


అటువంటి ఓ డాక్టర్ తన చిన్నారి పేషెంట్ కోసం బ్యాట్ మెన్ గెటప్ వేసుకున్నారు. సినిమాల్లో బ్యాట్ మెన్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సూపర్ హీరోలాంటి ఊహాతీతమైన క్యారక్టర్లంటే పిల్లలు భలే ఇష్టపడుతుంటారు. అటువంటి ఓ చిన్నారి కోసం వైద్యవృత్తిని ప్రాణప్రదంగా ప్రేమించే ఓ డాక్టర్ బ్యాట్ మెన్ గెటప్ వేసుకున్నారు.
క్యాన్సర్ తో బాధపడే తన చిన్నారి పేషెంట్ కోసం తెల్లకోటు తీసి బ్యాట్ మెన్ గెటప్ అయిన నల్లడ్రెస్ వేసుకుని ఆ చిన్నారిని హృదయానికి హత్తుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా..ఆ డాక్టర్ ను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. హ్యాట్సాఫ్ డాక్టర్ అంటున్నారు. ‘ద ఫీల్ గుడ్ పేజ్’ షేర్ చేసిన ఈ వీడియోకి అప్ లోడ్ చేసిన వెంటనే 5,000 పైగా వ్యూస్ వచ్చాయి.


కంటినిండా నిద్రపోండి.. 42శాతం గుండెజబ్బుల ముప్పు తప్పినట్టే!


క్యాన్సర్ తో బాధపడే ఆ చిన్నారికి ట్రీట్ మెంట్ చేసే డాక్టర్..ఆ బాధను మరచిపోయేందుకు ఆచిన్నారిని మాటల్లో పెట్టి ‘‘బంగారం..నీ డ్రీమ్ ఏంటమ్మా అని అడగ్గా..నాకు బ్యాట్ మెన్ అంటే చాలా చాలా ఇష్టం..నేను బ్యాట్ మ్యాన్‌ను కలవాలనుకుంటున్నా అని చెప్పగా.. అది విన్న ఆ డాక్టర్ ఆలోచనలో పడ్డారు.ఆ చిన్నారి సమాధానం విన్న ఆ డాక్టర్ మనస్సు చలించిపోయింది. దీంతో వెంటనే ఆమరునాడు బ్యాట్ మెన్ డ్రెస్ వేసుకుని వచ్చి ఆ చిన్నారిని నవ్వించారారు డాక్టర్. తన బాధను మరచిపోయి కిలకిలా నవ్వుతున్న ఆ చిన్నారిని చూసి తల్లి కూడా సంతోషపడింది.


బ్యాట్ మ్యాన్ ఫుల్ గెటప్‌లో వచ్చిన డాక్టర్ ఆసుపత్రి వరండాలో నడుచుకుంటూ వచ్చి, ఆ చిన్నారి వద్దకు వచ్చీ..వంగి, ఆప్యాయంగా, ప్రేమగా..వాత్సల్యంగా,ప్రేమగా లాలిస్తూ హత్తుకునే వీడియో చూసినవారి హృదయాలను తాకింది. చాలా చాలా బాగుందీ నిజమైన డాక్టర్ అంటే ఇలా ఉండాలంటున్నారు నెటిజన్లు.ఆ డాక్టర్ పెద్ద మనస్సుకు లైకుల వరద వందల్లో వచ్చి పడుతున్నాయి.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *