క్యాన్సర్ పేషెంట్ కోసం బ్యాట్‌మ్యాన్ గెటప్‌లో వచ్చిన డాక్టర్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Cancer Patient: క్యాన్సర్‌తో సతమతమవుతున్న చిన్నారిని సంతోష పెట్టడానికి డాక్టర్ బ్యాట్‌మ్యాన్ అవతారమెత్తాడు డాక్టర్. ఆ పిల్లాడు సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో కొద్ది గంటల్లోనే 5వేల మంది చూశారు.

క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారిని కోరికేంటో చెప్పాలని డాక్టర్ అడిగాడు. కుదిరితే బ్యాట్‌మన్ కలవాలనుకుంటున్నట్లు చెప్పడంతో రెండో రోజే బ్యాట్‌మన్ డ్రెస్ వేసుకుని పిల్లాడి ముందు కనిపించాడు.

‘క్యాన్సర్ పేషెంట్ ను తన కల ఏంటో అడిగి తెలుసుకున్నాడు డాక్టర్. దానికి ఆ బుడ్డోడు బ్యాట్‌మన్‌ను కలవాలనుకుంటున్నట్లు చెప్పాడు. రెండో రోజే సూపర్ హీరో గెటప్‌లో వచ్చిన డాక్టర్ ఆ పిల్లాడి మొహంలో సంతోషం చూడడంలో సక్సెస్ అయ్యాడు’ అని ఈ వీడియోలో రాసి పోస్టు చేశారు.

దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘ప్రపంచంలో ఇంత మంచి వారు ఉన్నారా.. కేవలం మంచితనంతో ఇలా చేయగలరా’ అని కామెంట్ చేయగా.. మరొకరేమో ‘కన్నీళ్లు ఆగడం లేదు’ అంటూ కామెంట్ చేశాడు.

Related Tags :

Related Posts :