భర్తను.. పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న డాక్టర్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో ఇద్దరు చదువుకుంటున్న పిల్లలను, భర్తను చంపి తానూ ఆత్మహత్య చేసుకుంది డా. సుష్మా రానె. భర్త ధీరజ్‌(42)ను ఇంజనీరింగ్ కాలేజిలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. పిల్లల్లో ఒకరికి ఐదేళ్లు కాగా, ఇంకొకరికి 11 సంవత్సరాలు. బెడ్ రూంలో భర్త, పిల్లలు శవాలు, ఫ్యాన్ కు ఉరివేసుకుని డాక్టర్ చనిపోవడం చూసి కేస్ ఫైల్ చేసుకున్నారు.వారితో పాటు కలిసి ఉంటున్న 60 ఏళ్ల బామ్మ బెడ్ రూం తలుపు తీయడానికి ప్రయత్నించడంతో ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. ఘటనా స్థలంలో రెండు సిరంజీలతో పాటు ఓ సూసైడ్ నోట్ ను పోలీసులు గుర్తించారు. తప్పటడుగు వేశానని దాని కారణంగానే అసంతృప్తితో ఉన్నానని అందులో డాక్టర్ రాసుకొచ్చింది.పిల్లలకు మత్తు పదార్థాన్ని ఆహారంలో కలిపి పెట్టి అపస్మారక స్థితికి చేరుకున్న తర్వాత ఇంజెక్ట్ చేసింది. మృతదేహాలను పోస్టు మార్టం నిర్వహించి మరికొన్ని వివరాలు సేకరించారు. వారు డాక్టర్ ప్రయోగించిన ఇంజెక్షన్ కారణంగా చనిపోయారా.. చనిపోవడానికే ఇంజెక్షన్ ఇచ్చిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.


Related Posts