హానీ ట్రాప్ ఉచ్చులో వైద్యుడు, చికిత్స పేరిట నాటకమాడి 1.25 లక్షల దోపిడి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Doctor loses Rs 1.25 lakh after woman at ‘patients’ house : హానీ ట్రాప్ ఉచ్చులో ఓ వైద్యుడు చిక్కుకున్నాడు. మహిళలు పన్నిన వలలో ఆ వైద్యుడు రూ. 1.25 లక్షలు పోగుట్టుకున్నాడు. ఈ కొత్త రకం హానీ ట్రాప్ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని ఖేడా జిల్లాలో చోటు చేసుకుంది. Kheda జిల్లాలోని Nadiad civil hospital లో 49 సంవత్సరాలు గల ఓ వ్యక్తి వైద్యుడిగా పని చేస్తున్నాడు. తన భర్త అనారోగ్యంతో ఉన్నాడని, ఇంటికి వచ్చి చూడాలని ఓ మహిళ వైద్యుడిని కోరింది. దీనికి ఒప్పుకుని ఆమె చెప్పిన ఇంటికి వెళ్లాడు.
ఇంట్లోకి వెళ్లగానే..ఆ మహిళ తన ఒంటిపై నున్న దుస్తులను తొలగించి వేసింది. దీంతో ఆ వైద్యుడు షాక్ తిన్నాడు. ఇదే సమయంలో సినీ ఫక్కీలో ముగ్గురు వ్యక్తులు పోలీసు దుస్తుల్లో వచ్చారు. రోగి బంధువుపై అఘాయిత్యానికి పాల్పడుతున్నావా అంటూ బెదిరించారు. అనంతరం అతడిని, ఆమెతో కలిపి కొన్ని అసభ్యకర ఫొటోలు తీసుకున్నారు. దీంతో తనకు ఏ పాపం తెలియదన్నాడు.
కానీ వారు బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డారు. రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు అతను రూ. 1.25 లక్షలు ఇస్తానని చెప్పాడు. అనంతరం ఇంకా వేధింపులకు గురి చేసినట్లు సమాచారం. బాధితుడు Petland town పట్టణ పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనలో Prafulla Darji, Akhrojbanu Saiyed, Shaku Chavda, Ishwar Patel, Dhirendra Solanki, Girish Solanki అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారిస్తున్నట్లు superintendent of police (SP) Ajit Rajian వెల్లడించారు. అసభ్యకరమైన వీడియోలను చిత్రీకరించడానికి ఉపయోగించబడిన ఫోన్ లను స్వాధీనం చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.

Related Tags :

Related Posts :