doctor sexually attacked patient

తలనొప్పి అంటే మత్తు మందిచ్చి లైంగిక దాడి చేసిన డాక్టర్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

వైద్యం కోసం వచ్చిన మహిళపై లైంగిక దాడికి యత్నించాడో డాక్టర్. ఏలూరు నగరం వన్‌టౌన్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దాడికి పాల్పడిన పారామెడికల్‌ వైద్యుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. పి.సత్యానందం ఏలూరు వన్‌టౌన్‌ నవాబ్‌పేట మారుతీనగర్‌ ప్రాంతంలోని క్లినిక్‌ను నిర్వహిస్తున్న వ్యక్తి.. ఏలూరు ఆర్‌ఆర్‌పేటలోని కంటివైద్యశాలలో పారామెడికల్‌ వైద్యునిగా పనిచేస్తున్నాడు. స్థానికంగా క్లినిక్‌ నిర్వహిస్తూ వైద్యం చేస్తున్నాడు.

స్థానికంగా ఉంటున్న ఓ యువతి తలనొప్పితో బాధపడుతూ ఆదివారం క్లినిక్‌కు వచ్చింది. మందులిచ్చిన డాక్టర్ రెండో రోజు కూడా రావాలని చెప్పడంతో మరోసారి సోమవారం తమ్ముడిని తీసుకువెళ్లింది. ట్రీట్‌మెంట్‌లో భాగమని చెప్పిన సత్యానందం యువతికి ఇంజెక్షన్‌ చేశాడు. కాసేపటి వరకూ ఇంజెక్షన్ ప్రభావానికి తల తిరుగుతుందని, కొంచెం సేపు ఓర్చుకోవాలని సూచించాడు.

అదే సమయంలో ఆమెపై లైంగిక దాడికి యత్నించడంతో యువతి గట్టిగా కేకలు వేసింది. బయట ఉన్న యువతి తమ్ముడు లోపలికి వెళ్లి డాక్టర్‌ను అడ్డుకున్నాడు. వెంటనే విషయాన్ని యువతి బంధువులకు తెలియజేశారు. ఆవేశంతో వచ్చిన వారంతా క్లినిక్‌ వద్దకు చేరుకుని వైద్యునికి దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత పోలీసులను పిలిచారు. వన్‌టౌన్‌ పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

కేసు నమోదు చేసిన ఏలూరు వన్‌టౌన్‌ ఎస్‌ఐ రామకృష్ణ దర్యాప్తు చేపట్టారు.

Read:ఆస్తి కోసం అక్కలనే చంపేశాడు, హైదరాబాద్ పాతబస్తీ డబుల్ మర్డర్ కేసులో కొత్త కోణాలు