మనిషి చచ్చినట్లుగా ఈ రచ్చేందీ? ‘చచ్చింది కుక్కేగా రూ. 250 తీసుకుని నోర్మూసుకోండి..’

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

‘చచ్చింది కుక్కేగా రూ. 250 తీసుకుని నోర్మూసుకోండి..’ ఏదో మనిషి చచ్చినట్లుగా ఈ రచ్చేంటీ..ఈ లొల్లేంది ఇచ్చినకాడికి తీసుకుని నోరు మూసుకుని పోండి’’అంటూ కుక్కను కారుతో గుద్ది చంపి ఏమాత్రం మానవత్వం లేకుండా ఓ మనిషి మాట్లాడిని మాటలివి. హైదరాబాద్ హయత్ నగర్‌ లో పోలీసుల సాక్షిగా జరిగిన పంచాయితీ ఇది. ఓ వ్యక్తి పెంచుకునే కుక్కను మరో వ్యక్తి కారుతో గుద్దేసి నానా రభసా చేస్తూ పొగరుతో..ధనమదంతో వ్యవహరించిన తీరుకు పోలీసులే సాక్ష్యంగా నిలవటం గమనించాల్సిన విషయం.


వివరాల్లోకి వెళితే..హయత్ నగర్ కు చెందిన శ్రీనివాసరావు ఇటీవల లాబ్రాడర్ జాతికి చెందిన ఓకుక్కపిల్లను తెచ్చుకుని పెంచుకుంటున్నారు. ఆకుక్కపిల్లంటే అతని కూతురికి ప్రాణం. దాంతోనే ఆడుకుంటుంటుంది. ఈ క్రమంలో గత శనివారం (సెప్టెంబర్ 24) కూతురితో కలసి ఆ కుక్కపిల్లను టాయిటెల్ కోసం రోడ్డుపైకి తీసుకొచ్చాడు. అదే సమయంలో అత్యంత వేగంగా వచ్చిన ఓ కారు ఆ కుక్కపిల్లను గుద్దేసింది. కారు వేగానికి శ్రీనివాస రావుకు, అతని కూతురుకు తృటిలో ప్రమాదం తప్పింది. కానీ కుక్కపిల్లను పక్కకు లాగే సమయంలోనే ఆ కారు కుక్కపిల్లను గుద్దేసింది. దీంతో దానికి తీవ్రంగా గాయాలయ్యాయి.


సంఘటనా స్థలంలో ఉన్న అదే కారులో కుక్క యజమాని శ్రీనివాసరావు పశువుల ఆసుపత్రికి తీసుకెళ్లాడు. . ‘ఏదో మనిషి చచ్చినట్లు అరుస్తారేంటీ..ఆఫ్ట్రాల్ ఓ కుక్కను గుద్దినందుకు నా కారు పట్టుకెళతావా? అంటూ శ్రీనివాసరావు యజమాని ఇంటిపై సుమారు 50మందిని నిందితుడు తీసుకొచ్చి ఇంట్లో ఉన్న వృద్ధురాలిని, యజమాని కుటుంబ సభ్యులను ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఇంటిపైకి దాడి చేశారు. మొబైల్‌ వ్యాన్‌ పోలీసుల సమక్షంలోనే వీరంగం చేశారు. దీంతో శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


దాడిచేసిన వారిపై క్రిమినల్‌ కేసు పెట్టాలని, కుక్కపిల్లను చంపిన వ్యక్తిని యానిమల్‌ యాక్ట్‌ ప్రకారం శిక్షంచాలని కుక్కపిల్ల యజమాని శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకోలేదు..చిన్న గొడవకు ఇంత పెద్ద గొడవేంటీ అంటూ..గొడవ చేస్తూ ఇంటిపై దొమ్మీ చేస్తుండగా ప్రత్యక్షంగా చూసిన పోలీసులు చట్ట పరిధిలోకి వచ్చే ఏ అంశాలను పట్టించుకోకుండా, సంఘటన జరిగిన సమయంలో కేసును పంచనామ చేయకుండానే నామ మాత్రంగా కేసు పెట్టి నిందితులను కారుతో సహా పోలీసులు వదిలి వేశారు.చనిపోయిన తన కుక్కకు కేవలం రూ. 250 లు చెల్లించి కేసును నీరుగార్చేశారని..‘‘ఏంటీ ఏదో మనిషి చచ్చినట్లుగా ఈ పంచాయితీలేంటీ..ఈ రచ్చేందే..కావాలంటే పాతికో పరకో పారేస్తానంటూ రూ.250 ఇచ్చి నోరుమూసుకోండి‘‘అంటూ విసిరికొట్టి అక్కడ నుంచి వెళ్లిపోయినా పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదని వాపోయాడు. అల్లారు ముద్దుగా కుక్కపిల్లను పెంచుకుంటున్న ఆ కుటుంబం నిందితుల నుంచి ప్రమాదముందని భయం గుప్పిట్లో బతుకుతున్నామనీ..మూగజీవిపై కనీసం మానవత్వం కూడా చూపించలేదనీ కుక్కపిల్లను చంపిన వ్యక్తిపై యానిమల్‌ యాక్టు నమోదుచేయాలని, దాడిచేసిన వారిపై పలు సెక్షన్ల కింద క్రిమినల్‌ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని బాధితులు కోరుతున్నారు.

READ  మందుబాబుల డ్రామా : కరోనా వంకతో డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్ట్ తప్పించుకునే ప్లాన్‌

Related Posts