ఏయ్..బాల్ వేయవేందిరా…ఓ.. నువ్వు మనిషివి కాదా…భలేగుందిలే

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యే కొన్ని వీడియోలు చూస్తే నవ్వు ఆగదు. కొన్ని సరదా సరదాగా ఉంటాయి. మరికొన్ని ఫ‌న్నీగా ఉంటాయి. అటువంటిదే ఐఏఎస్ అధికారి సుప్రియా సాహూ ట్విట‌ర్ ద్వారా షేర్ చేసిన ఈ వీడియో. ఒక కుక్క ఆహా..ఆడుకోవటానికి నాకో మనిషి దొరికాడు అనుకుంది. కానీ అది మనిషి కాదు విగ్ర‌హం అని పాపం దానికి తెలీలేదు. దీంతో ఆ విగ్రహంతో ఫెచ్ ఆడ‌డానికి ప్రయత్నిస్తూ విగ్రహం కాళ్ల దగ్గరకు బంతి వేసింది.కానీ అతను లేవలేదు. ఎందుకంటే అది విగ్రహం కదా. కానీ ఆ కుక్క మాత్రం బాల్ ఎప్పుడు వేస్తాడా? అని ఎదురు చూసింది. ఎంతకూ అతను కదలకపోవటంతో ఏంటీ వీడు బాల్ వేయడేంటీ..నాతో ఆడటం ఇష్టం లేదా అన్నట్లుగా చూసింది. చాలాసేపు ఎదురు చూసింది పాపం. త‌ర్వాత బంతిని పాదాల వైపుకు నెట్టింది. అత‌ను బంతిని పాస్ చేస్తాడేమో అని ఎదురు చూసింది. కాని అది జ‌ర‌గ‌లేదు.అత‌ను ఎంత‌సేప‌టికీ క‌ద‌ల‌క‌పోయేస‌రికి కుక్క బంతిని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో ఫన్నీ ఫన్నీగా వైరల్ అయిపోతోంది. ఐఏఎస్ అధికారి సుప్రియా సాహూ ఈ వీడియోను షేర్ చేస్తూ..”హే, మీరు ఎందుకు బాల్‌తో ఆడ‌డం లేదు మ్యాన్ఎం?’ అనే శీర్షిక‌ను జోడించారు. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Related Posts