లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

కరోనా రోగి మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు, హైదరాబాద్‌లో దారుణం

Published

on

హైదరాబాద్ ఈఎస్ఐ స్మశాన వాటికలో దారుణం చోటు చేసుకుంది. సగం కాలిన కరోనా రోగి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతున్నాయి. మృతదేహాన్ని పూర్తిగా కాల్చకుండానే కాటికాపర్లు వదిలేశారు. దీంతో మృతుడి పుర్రెలు, చేతులు బయటకు కనిపిస్తున్నాయి. అక్కడికి చేరుకున్న కుక్కలు మృతుడి శరీర భాగాలను పీక్కుతింటున్నాయి. దీనికి కారణం జీహెచ్ఎంసీ అధికారుల నిర్ల్యక్షమే అనే ఆరోపణలు వస్తున్నాయి. కరోనా మృతుల దహన సంస్కారాలను జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఇలా జరుగుతోందని ప్రజలు మండిపడుతున్నారు. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో డెడ్ బాడీలు సగమే కాలుతున్నాయి. దీంతో ఆ శవాలను కుక్కలు పీక్కుతింటున్నాయి.

మరోసారి బయటపడిన జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం:
కరోనా రోగి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న అమానుష ఘటన అందరిని ఆవేదనకు గురి చేసింది. మృతుల బంధువులను మరింత బాధిస్తోంది. అసలే అయిన వారిని కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉండగా, ఇలాంటి ఘటనలు వారిని మంత ఏడిపిస్తున్నాయి. మానసిక క్షోభకు గురి చేస్తున్నాయి. దీనిపై అధికారులు స్పందించి మరోసారి ఇలాంటి ఘటనలు జరక్కుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మృతదేహాల దహన సంస్కారాలు దగ్గరుండి చూసుకోవాలంటున్నారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయేలా చూడాలంటున్నారు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో కరోనాతో చికిత్స పొందితే.. వారి మృతదేహాలను ఈఎస్‌ఐ సమీపంలోని సత్యహరిశ్చంద్ర శ్మశాన వాటికలో దహనం చేస్తున్నారు. అయితే పూర్తిగా కాలని మృతదేహాలను కుక్కలు పీక్కుతింటున్నాయి. ఈ హృదయవిదారక దృశ్యాలు ఆవేదనకు గురి చేస్తున్నాయి.

తాత అస్తికల కోసం స్మశాన వాటికక వచ్చిన వ్యక్తికి షాక్:
చనిపోయిన వారి వివరాలను నమోదు చేయడం, అంత్యక్రియలు నిర్వహించడం వంటివి జీహెచ్ఎంసీ పర్యవేక్షిస్తోంది. ఇందుకోసం శ్మశాన వాటికలో సిబ్బందిని కూడా నియమించింది. కానీ కరోనా పేషెంట్ల మృతదేహాలు సరిగా కాలకపోయినా సిబ్బంది పట్టించుకోవడం లేదు. ఓ వ్యక్తి తన తాతయ్య అస్థికల కోసం శ్మశానానికి రాగా సగం కాలిన డెడ్ బాడీలను కుక్కలు పీక్కుతినడం చూసి షాకయ్యాడు. కాగా, మృతదేహాలు పూర్తిగా కాలే వరకూ చూడాల్సిన బాధ్యత మాది కాదంటే మాది కాదని శ్మశాన వాటిక నిర్వాహాకులు, జీహెచ్ఎంసీ అధికారులు చెప్పడం గమనార్హం.

అమానవీయంగా కరోనా మృతుల అంతిమ సంస్కారాలు:
కోవిడ్‌తో మరణించిన వారి నుంచి కూడా ఇన్ఫెక్షన్ ఇతరులకు సోకే అవకాశం ఉండటంతో అంత్యక్రియల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా బారిన పడి ఆత్మీయులు చనిపోయినా చివరి చూపు చూడటానికి కూడా వెళ్లలేని పరిస్థితి ఉంది. చాలా సందర్భాల్లో కుటుంబ సభ్యులు హోం క్వారంటైన్ లో ఉంటుండటంతో.. అంత్యక్రియలను కూడా మున్సిపాలిటీ సిబ్బంది చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మానవత్వం లేకుండా కరోనా మృతదేహాలను గుంతల్లోకి విసిరేస్తున్న వీడియోలు ఇటీవలే బయటకొచ్చాయి. ఇప్పుడు సగం కాలిన మృతదేహాల దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా వైరస్‌తో ఆత్మీయులు చనిపోయి కుటుంబాలు పుట్టెడు దుఃఖంలో ఉండగా, వారిని మరింత క్షోభ పెట్టేలా సిబ్బంది అమానుషంగా, అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. కనీసం అంతిమ సంస్కారాలైనా సరైన పద్ధతిలో నిర్వహించి వారి ఆత్మకు శాంతి చేకూరేలా చూడాలని కోరుతున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *