లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Business

చైనాకు ట్రంప్ లాస్ట్ పంచ్ : డ్రాగన్ దిగ్గజం షియామీని బ్లాక్ లిస్టులో పెట్టిన ట్రంప్ ప్రభుత్వం!

Published

on

Trump administration blacklists SmartPhone Maker Xiaomi : అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఆఫీసు వీడేందుకు ఇక మిగిలింది ఐదు రోజులు మాత్రమే. వెళ్లే ముందు చైనాకు ఒక ఝలక్ ఇవ్వాలనుకున్నారేమో.. అందుకే లాస్ట్ పంచ్ తనదైతే ఆ కిక్కే వేరబ్బా అన్నట్టు.. వెళ్లేముందు చైనాకు మరో షాక్ ఇచ్చారు ట్రంప్. చైనా సంబంధించిన అనేక సంస్థలపై నిషేధం విధించిన ట్రంప్.. చైనీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం షియామీని బ్యాన్ చేయాలని నిర్ణయించారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఫోన్ తయారీల సంస్థ అయిన షియామీని బ్లాక్ లిస్టులో పెట్టాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది.

యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ డిఫెన్స్.. షియామీని చైనీస్ కమ్యూనిస్ట్ మిలటరీ కంపెనీగా చూపిస్తూ బ్లాక్ లిస్టులో పెట్టాలని నిర్ణయించింది. అంటే.. అమెరికాలో షియామీ వంటి కంపెనీల్లో పెట్టుకుండా నిషేధం విధించినట్టు అర్థం. దీని కారణంగా నవంబర్ 11, 2021లో అమెరికా కంపెనీలు సహా ఇతర యూఎస్ పెట్టుబడిదారులంతా షియామీలో నుంచి పెట్టుబడులను బలవంతంగా వదులుకోవాల్సి పరిస్థితి ఎదుర్కోన్నాయి.

ఈలోపు ట్రంప్ ఆదేశాలపై బైడెన్ ప్రభుత్వం తిప్పికొట్టే చాన్స్ కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో షియామీ అమెరికా బ్లాక్ లిస్టులో ఉంటుందా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది. బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీల్లో ఎక్కువగా పారిశ్రామిక ఆధారిత కంపెనీలే ఉన్నాయి. ఏవియేషన్, ఏరో స్పేస్, షిష్ బుల్డింగ్, కెమికల్స్, టెలికమ్యూనికేషన్స్, నిర్మాణ రంగం, ఇతర ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగానికి చెందినవే ఉన్నాయి.

హువావే.. ప్రపంచ రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మేకర్.. ఈ కంపెనీ కూడా బ్లాక్ లిస్టులో ఉంది. కానీ, హువావే.. అతిపెద్ద టెలికమ్యూనికేసన్స్ ఈక్విప్ మెంట్ నిర్మాణ రంగంలోనూ ఉంది. ట్రంప్ ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టిందనే విషయంలో స్మార్ట్ ఫోన్ మేకర్ షియామీ ఇప్పటివరకూ స్పందించలేదు.