Home » అమెరికాలో త్వరలో టిక్‌టాక్ బ్యాన్
Published
6 months agoon
By
vamsiకరోనా వైరస్ సంక్రమణ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై తన దూకుడు వైఖరిని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే టిక్‌టాక్‌ని బ్యాన్ చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. చైనా తన గూఢచార కార్యకలాపాలకు ఈ యాప్‌ని వినియోగించ వచ్చునని అధికారులు ఆందోళన వ్యక్తం చేయడంతో ఆయన ఈ ప్రకటన చేశారు.
అమెరికా వ్యతిరేక చర్యలకు ఈ యాప్ పాల్పడుతోందని అమెరికన్ ఎంపీలు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా అమెరికా చెబుతుంది. అయితే చైనా ఈ వార్తలను ఖండించినా.. వారు విశ్వసించట్లేదు. టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్ డాన్స్ నుంచి దీని కార్యకలాపాలను వేరు చేయాలని ట్రంప్ తమ ఆపరేటర్లను ఆదేశించవచ్ఛునని మొదట వార్తలు వచ్చినప్పటికీ ఏకంగా దీనిని బ్యాన్ చేస్తామని ట్రంప్ ప్రకటించారు.
చైనా ఇంటెలిజెన్స్‌కు ఈ సేవ ఒక సాధనంగా ఉండవచ్చని అమెరికా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నందున అమెరికాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్‌ను తాను నిషేధించనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. జాతీయ భద్రత, సెన్సార్షిప్ ఆందోళనలే దీనికి ప్రధాన కారణమని ఆయన వెల్లడించారు. అయితే చైనా ప్రభుత్వానికి ఈ యాప్‌తో ఎటువంటి సంబంధాలు లేవని కంపెనీ ప్రకటించింది.
వాస్తవానికి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో చైనాకు చెందిన బైట్‌డాన్స్ సంస్థ యాజమాన్యంలోని టిక్‌టాక్ యాప్‌ను విక్రయించినట్లు వార్తలు వచ్చినప్పుడు ఈ విషయం చెప్పారు. చైనాకు చెందిన బైట్‌డాన్స్ సంస్థ యాజమాన్యంలోని టిక్‌టాక్‌ను కొనుగోలు చేయడానికి సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చర్చలు జరుపుతున్నట్లు చెబుతున్నారు.
వైట్‌హౌస్‌లో డొనాల్డ్ ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ, ‘మేము నిరంతరం టిక్‌టాక్‌ను చూస్తున్నాం. ఈ యాప్‌ను రాబోయే సమయంలో నిషేధించవచ్చు. టియోటాక్ నిషేధంతో, దాని ఎంపికలపై కూడా మేము నిఘా ఉంచామని ట్రంప్ చెప్పారు.