అమ్మాయిలూ..పర్‌ఫెక్ట్‌ భర్త దొరకడు..అందుకే ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకోకండీ..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Puri musings : కాబోయే భర్త గురించి అమ్మాయిలు పెద్ద పెద్ద ఎక్స్ పెటేషన్స్ పెట్టుకోవద్దనీ..ఏ అమ్మాయికి ‘‘మిస్టర్ పర్ ఫెక్ట్’’భర్త దొరకడనీ అందుకని పెద్దగా ఆశలు పెట్టుకోవద్దనీ..తన ఊహలకు తగిన భర్త దొరకకపోతే తరువాత వారు బాధపడాల్సి వస్తుందని కాబట్టి పెద్ద ఊహలు పెట్టుకోవద్దని ప్రముఖ సీని దర్శకుడు పూరీ జగన్నాథ్ సూచించారు.


‘‘పూరీ మ్యూజింగ్స్’’ పేరుతో పలు అంశాలపై తన అభిప్రాయాల గురించి మాట్లాడుతోన్న పూరీ జగన్నాథ్ తాజాగా భర్తల గురించి..కాబోయే భర్తల గురించి అమ్మాయిలు ఎలా ఊహించుకుంటారో అనే విషయంపై మాట్లాడారు. మహిళకు పర్‌ఫెక్ట్‌ తండ్రి, అమ్మ, డ్రైవర్‌, నర్సు దొరుకుతారేమో కానీ, పర్‌ఫెక్ట్‌ భర్త మాత్రం దొరకడని అన్నారు. తనకు కాబోయే భర్త గురించి అనేక ఎక్స్ పెక్టేషన్లు పెట్టుకుని..తను కోరుకున్నట్లే ఉండాలని అనుకుంటే సమస్యల్లో పడిపోతారని..అలా అనుకుని అటువంటివారు దొరకకపోతే సమస్యల్లో పడతారని అన్నారు.


పెళ్లయిన ప్రతి అమ్మాయి ఏదో ఒక సమయంలో కన్నీరు పెట్టాల్సిందేనని తెలిపారు. శ్రీరామ చంద్రుడు భార్య సీతాదేవికి కూడా కన్నీరు పెట్టిందని గుర్తు చేశారు. దేవుళ్లకు కూడా తమ భార్యలను ఏడ్వకుండా చూసుకునేవాళ్లు లేదని అన్నారు.


అమ్మాయిలను వారి జీవితంలో చాలా మంది ఏడిపిస్తుంటారు..కానీ ఎక్కువగా ఏడిపించే అవకాశం మాత్రం వారి భర్తకే దక్కుతుందన్నారు. భర్తలు భార్యకు ఎంత సన్నిహితంగా ఉన్నా..అన్యోన్యంగా ఉన్నా సరే..జీవితంలో భార్యకు చెప్పి కొన్ని, చెప్పకుండా కొన్ని చేస్తుంటారు..దీంతో భార్యలకు భర్తలపై కోపం వస్తుంది..అది సహజం కూడా అని తనదైన స్టైల్లో తెలిపారు పూరీ.


కానీ ఇటువంటివి తప్పుకాదు..అటువంటి తప్పులు అమ్మాయిల నాన్నలు కూడా చేస్తారు..కానీ అమ్మాయిలు నాన్నలను క్షమించేస్తారు గానీ భర్తల్ని మాత్రం క్షమించరు..నాన్ననలు తప్పులు చేసినప్పుడు అమ్మ ఎన్నిసార్లు ఎంతగా ఏడ్చిందో గుర్తు తెచ్చుకోవాలని పూరీ అమ్మాయిలకు సూచించారు. తండ్రిని క్షమించినట్లే భర్తను కూడా క్షమించి వదిలేయాలని సూచించారు.


అంతేకాదు చూసినదాని కంటే చెప్పుడు మాటలు మహిళలమీద ప్రభావం చూపిస్తాయని అందుకే ఇరుగుపొరుగు మహిళలు చెప్పే మాటలు విని భర్తలతో గొడవపడొద్దని అమ్మాయిలకు సుద్దులు చెప్పారు పూరీ.


భర్త ఎంత గొప్ప వాడైతే భార్యకు అన్ని కన్నీళ్లు వస్తాయని ..పురుషులు మంచి వాళ్లు కాదని..అలాగనీ వాళ్లు రాక్షసులు కాదని ఇది ప్రతీ భార్యా..ప్రతీ అమ్మాయి తెలుసుకోవాలని అన్నారు. వివాహం అంటే సర్దుకుని పోవడమేనని..సర్ధుకుపోవటంలోనే సంసారంలోని మధురిమలు ఉంటాయని చెడును వదిలేసి మంచిని తీసుకుని సంసారాలను చక్కగా చేసుకుంటూ ఆనందాన్ని ఆస్వాదించాలని సూచించారు పూరీ.

Related Tags :

Related Posts :