ఇలాంటివి చూస్తుంటే రక్తం మరిగిపోతోంది : రాహుల్​ గాంధీ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

భారత్​-చైనా సరిహద్దు అంశమై కేంద్రంపై విమర్శలు కురిపిస్తూనే ఉన్నారు కాంగ్రెస్​ నాయకుడు రాహుల్​ గాంధీ. చైనా దురాక్రమణలపై ఇవాళ(జులై-27,2020) మరోసారి కేంద్రాన్ని విమర్శించారు రాహుల్​ గాంధీ. చైనా.. భారత భూభాగాన్ని ఆక్రమించిందని చెప్పిన రాహుల్.. మోడీ .సర్కార్ నిజాలను దాస్తూ.. జాతి ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తోందని ఆరోపించారు.

భారత భూభాగాన్ని ఆక్రమించుకునేలా చైనాకు అవకాశమివ్వడం.. దేశ వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించడమేనని, కేంద్రం నిజాన్ని దాస్తోందని రాహుల్ ఆరోపించారు. ఈ మేరకు మోడీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తన ట్విట్టర్ లో మరో వీడియోను విడుదల చేశారు రాహుల్​. సరిహద్దు ఉద్రిక్తతలపై రాహుల్​.. వీడియో విడుదల చేయడం ఇది నాలుగోసారి.

చైనా.. భారత భూభాగాన్ని ఆక్రమించుకుంది. మోడీ ప్రభుత్వం నిజాన్ని దాస్తూ.. జాతి ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించింది. దీనిని ఇప్పుడు ప్రజల దృష్టికి తీసుకొచ్చి.. దేశభక్తిని చాటుకొనే ప్రయత్నం చేస్తోంది. చైనా దళాలు మన భూభాగంలోకి చొచ్చుకురావడం తనకు తీవ్ర ఆవేదన కలిగించిందని రాహుల్​ అన్నారు. అసలు వేరే దేశ సైన్యం.. భారత్​లోకి ఎలా ప్రవేశించగలదని ప్రశ్నించారు.

ఇలాంటివి చూస్తుంటే తన రక్తం మరిగిపోతోందన్నారు రాహుల్. రాజకీయాల్లో ఉంటూ మౌనంగా కూర్చోలేనని, ప్రజలకు అబద్ధం చెప్పలేనని రాహుల్ తెలిపారు. తాను శాటిలైట్​ ఫొటోలు చూశానని, ఆర్మీ మాజీ అధికారులతో మాట్లాడానని చెప్పారు. .తన రాజకీయ జీవితం ఏమైనా సరే.. చైనా.. భారత భూభాగంలోకి రాలేదని మోడీ ప్రభుత్వం నమ్మించే ప్రయత్నాలు చేసినా తాను నమ్మనన్నారు .చైనా.. భారత భూభాగాన్ని ఆక్రమించలేదని చెప్పేవారు జాతీయ వాదులు కాదని, వారికి దేశ భక్తి లేదని రాహుల్ మండిపడ్డారు.

Related Posts