double bedroom houses

డిసెంబర్ లో గృహప్రవేశాలు : 1.35లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు సిద్ధం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తెలంగాణ రాష్ట్రంలో పేదల కోసం ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు సిద్ధమయ్యాయి. డిసెంబర్ లో 1.35లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలకు ఏర్పాట్లు

తెలంగాణ రాష్ట్రంలో పేదల కోసం ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు సిద్ధమయ్యాయి. డిసెంబర్ లో 1.35లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటిలో 36వేల ఇళ్లు పూర్తయ్యాయి. 99వేల ఇళ్ల నిర్మాణం చివరిదశకు చేరింది. ప్రభుత్వం ఇప్పటికే 32వేల ఇళ్లను పేదలకు పంపిణీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 2లక్షల 83వేల 401 ఇళ్లను కేటాయించి, వాటికి పరిపాలనా అనుమతులు జారీ చేసింది. 

లక్ష 99వేల 353 ఇళ్లకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ఆయా కాంట్రాక్టర్లకు అగ్రిమెంట్ చేశారు. వీటిలో లక్ష 73వేల 78 ఇళ్ల పనులు ప్రారంభమయ్యాయి. 32వేల ఇళ్లను లబ్దిదారులకు అప్పగించగా నవంబర్ 1 తేదీ నాటికి 36వేల 136 ఇళ్ల నిర్మాణం వందశాతం పూర్తయింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటివరకు రూ.7వేల కోట్లు ఖర్చు చేసింది. 

99వేల 554 ఇళ్లు 95శాతానికి పైగా నిర్మాణాలు పూర్తి అయ్యాయి. మిగిలిన 5శాతం అంటే ఇళ్ల ముందు కాల్వలు, లైట్లు ఏర్పాటు చేయడం వంటి పనులు మిగిలున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 97వేల ఇళ్ల నిర్మాణాలు మొదలుపెట్టగా.. 77వేల 406 ఇళ్లు పూర్తి దశకు చేరుకున్నాయి.

Related Posts