లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Uncategorized

నమో నరసింహ : యాదాద్రి చుట్టూ డబుల్ రోడ్లు 

Published

on

Double roads around Yadadri

యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఫిబ్రవరిలో యాదాద్రి క్షేత్రంలో మహా సుదర్శనయాగం నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గర్భాలయం, ప్రధాన ఆలయం, టెంపుల్ సిటీ, ప్రెసిడెన్షియల్ భవనాలు, చెరువుల అభివృద్ధి, గుట్ట చుట్టూ..రోడ్డు వంటి ప్రధాన పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున అతిథులు రానుండడంతో యాదగిరి గుట్టకు నలుదిక్కుల నుంచి వచ్చే రోడ్ల మరమ్మత్తుల కోసం ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన నిధులను కేటాయించింది.

రోడ్ల అభివృద్ధి, డబుల్ రోడ్ల నిర్మాణం కోసం రూ. 75 కోట్ల నిధులను మంజూరు చేసింది. వెంటనే పనులు ప్రారంభించాలని RRB శాఖకు ఉత్తర్వులు జారీ చేసింది. 
2020 ఫిబ్రవరి నెలలో యాదాద్రి క్షేత్రంలో గర్భాలయాన్ని ప్రారంభించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగా యాదాద్రికి వచ్చే భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలోని 7 రోడ్లను అభివృద్ధి చేయాలని సర్కార్ నిర్ణయించింది. రోడ్ల అభివృద్ధికి నిధులను మంజూరు చేశారు. వెంటనే పనులను ప్రారంభిస్తామని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత వెల్లడించారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. 
Read More : ఆర్టీసీ సమ్మె..వాట్ నెక్ట్స్ : సుప్రీంకు వెళ్లే యోచన!

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *