రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై ఫ్యామిలీ స్పందన

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Rajasekhar Health Update: యాంగ్రీ స్టార్ డా.రాజశేఖర్ సహా ఆయన కుటుంబ సభ్యులందరూ ఇటీవల కరోనా బారిన పడ్డారు. కుమార్తెలు శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ ఇప్పటికే కరోనా నుంచి కోలుకోగా రాజశేఖర్ ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. గురువారం ఉదయం నుంచి ఆయన ఆరోగ్యం గురించి పలు వార్తలు వస్తుండడంతో భార్య జీవిత రాజ శేఖర్, కుమార్తెలు శివాత్మిక రాజశేఖర్, శివానీ రాజ శేఖర్ స్పందించారు.

రాజ శేఖర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉంది. తప్పుడు వదంతులను పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి. ఎవ్వరూ ఆందోళన చెందవద్దు..అందరు సానుకూలంగా వుండాలి..మీ అందరి ప్రేమ అభిమానాన్ని కోరుకుంటూ..
మీ
జీవిత రాజశేఖర్
శివాత్మిక రాజశేఖర్
శివానీ రాజ శేఖర్
అని తెలియజేశారు.

కాగా రాజశేఖర్ రాజశేఖర్ కు ఐసీయూలో చికిత్సనందిస్తున్నాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా వుంది. వైద్యానికి స్పందిస్తున్నారు అంటూ సిటీ న్యూరో సెంటర్ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Related Tags :

Related Posts :