Dr Reddy’s Laboratories begins work on Gilead drug clone

కరోనా మెడిసిన్ : రెడ్డీస్ లేబరేటరీల్లో “రెమ్ డిసివర్”జనరిక్ కాపీ సృష్టించే పని ప్రారంభం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అమెరికాకు చెందిన గిలీడ్ సైన్సెస్ అనే బయోటెక్నాలజీ కంపెనీ అభివృద్ధి చేసిన ప్రయోగాత్మక డ్రగ్”రెమ్ డిసివిర్”కరోనా వైరస్ సోకి,ఆరోగ్యపరిస్థితి విషయంగా ఉన్నవాళ్ల ఆరోగ్యపరిస్థితిని మొరుగుపర్చినట్లు వివిధ దేశాల్లో నిర్వహించిన ట్రయిల్స్ లో తేలిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రెమ్ డిసివిర్ యొక్క ఓ జనరిక్ కాపీని సృష్టించే ప్రారంభ దశల్లో డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్ ఉన్నాయి.

కరోనా వైరస్ కు వ్యాక్సిన్,డ్రగ్ ను డెవలప్ చేసే రేస్ లో ప్రపంచ శాస్త్రవేత్తలు ఉన్న సమయంలో..వాగ్దానం చూపించిన కొన్నింటిలో remdesivir(రెడ్ డిసివర్) కూడా ఉంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(CSIR)తో కలిసి తాము కూడా ఈ డ్రగ్ పై పనిచేస్తున్నట్లు కొన్నివారాల క్రితం ఇండియన్ డ్రగ్ తమారీదారు సిప్లా(Cipla)తెలిపింది.

డాక్టర్ రెడ్డీస్ కు ఇవి ప్రారంభరోజులు, కానీ ఈ డ్రగ్ ను REMDESIVIడెవలప్ చేసే పనిని ప్రారంభించారని ఈ విషయంతో సంబంధం ఉన్న ఓ వ్యక్తి చెప్పారు. పేటెంట్ విషయంలో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయని తెలిపారు. భారత్ లో ఈ డ్రగ్ కు గిలీడ్ పేటెంట్ కలిగి ఉంది. దురదృష్టవశాత్తూ,ఈ సమయంలో తాము ఎటువంటి కామెంట్ చేయలేమని డాక్టర్ రెడ్డీస్ ప్రతినిధి ఒకరు ఈమెయిల్ ద్వారా తెలిపారు.

వాస్తవానికి యాంటీవైరల్ ఎబోలా ట్రీట్మెంట్ కు ఉద్దేశించబడినది,కానీ అది విజయవంతం కాలేదు. ఈ వారం ప్రారంభంలో గిలీడ్ సంస్థ మాట్లాడుతూ….తమ సంస్థ స్పాన్సర్ చేసిన కారుణ్య ఔషధ వినియోగ కార్యక్రమం… తీవ్రమైన కోవిడ్ -19 ఇన్ఫెక్షన్ ఉన్న 53 మంది రోగులలో.. 36మందిలో క్లినికల్ మెరుగుదల గమనించినట్లు తెలిపింది.

కారుణ్య ఉపయోగం అనేది… మరేమీ అందుబాటులో లేనప్పుడు తీవ్రమైన అనారోగ్యానికి చికిత్స చేయడానికి అనుమతి లేని ఔషధాన్ని ఉపయోగించడాన్ని సూచిస్తుంది. కోవిడ్-19 ట్రీట్మెంట్ కోసం కెనడా,చిలీ,ఈక్వెడార్,జర్మనీ,ఇజ్రాయెల్ వంటి పలుదేశాలు తప్పనిసరి లైసెన్స్(CL)ను జారీ చేయాలని చూస్తున్నట్లు మెడిసిన్స్ శాన్ ఫ్రాంటరీస్(MSF)వంటి గ్రూప్ లు తెలిపాయి. అత్యవసర పరిస్థితుల్లో పెటెంటెడ్ డ్రగ్స్ తయారీకి “CL” జనరిక్ డ్రగ్ మేకర్స్ కు అనుమతిస్తుంది.

టెస్ట్ ప్రొడక్షన్
రెమ్ డిసివర్ ను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని తాము ఇప్పటికే కలిగి ఉన్నామని చైనాలోని 5జనరిక్ కంపెనీలు మరియు ఒక తైవనీస్ రీసెర్ట్ బాడీ,ది నేషనల్ ఇనిస్టిట్యూట్ ప్రకటించాయని MSF ఓ డాక్యుమెంట్ లో ప్రకటించింది. కొన్ని కంపెనీలు యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్(API)యొక్క టెస్ట్ ప్రొడక్షన్ ను నిర్వహించాయని,ఉత్పత్తిని పూర్తిచేశాయని తెలిపింది.

ఏదైనా దేశీయ కంపెనీ ఉత్పత్తి చేయగలిగితే ఈ డ్రగ్ ను భారతీయ పేషెంట్లపై ఉపయోగించే అంశాన్ని పరిశీలించనున్నట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్ట్(ICMR) తెలిపింది. అబ్జర్వేషనల్ స్టడీ ప్రాధమిక డేటా ఆధారంగా ఈ డ్రగ్ సమర్థవంతమైనదేనని ICMR హెడ్ సైంటిస్ట్ రామన్ గంగాఖేదర్ సోమవారం తెలిపారు. WHO సాలిడారిటీ ట్రయిల్ నుంచి ఫలితాల కోసం ఎదురుచూస్తామని,అంతేకాకుండా ఇంకా కొన్ని కంపెనీలు దీనిపై మరింత ముందుకు సాగగలదా అని కూడా చూడనున్నట్లు తెలిపారు. ఈ డ్రగ్ కు ప్రపంచంలో ఎక్కడా అఫ్రూవల్ లభించకపోయినప్పటికీ ఉత్పత్తిని పెంచుతున్నామని, మరియు ట్రయల్స్ విజయవంతమైతే అది కారుణ్య ఉపయోగం కోసం 1 మిలియన్ డోస్ లను అందించనున్నట్లు కొన్నివారాల క్రితం గిలీడ్ సీఈవో తెలిపారు.
 

READ  ఏపీ అసెంబ్లీ : పలు అంశాలపై చర్చ

Related Posts