Home » లడఖ్ కోసం కొత్త హీటింగ్ డివైజ్లు రెడీ చేసిన డీఆర్డీఓ
Published
2 weeks agoon
Indian Army: ఇండియాకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) ఇండియన్లకు హెల్ప్ చేసే విధంగా ఈస్టరన్ లడఖ్ లో సబ్ జీరో టెంపరేచర్ వద్ద సైనికులు తట్టుకుని నిలబడేందుకు లేటెస్ట్ ఎక్విప్మెంట్లు వాడుతున్నారు. ఈ మేరకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భాదౌరియా సోమవారం లడఖ్ ప్రాంతాలను సందర్శించారు.
కొన్ని వర్గాల సమాచారం మేరకు జనరల్ రావత్.. భారత ఆర్మీ బలగాలకు ఆయుధాలతో పాటు ఎప్పుడైనా రెడీగా ఉండేలా చూడాలి. ఫార్వార్డ్ ఏరియాల్లో ఉన్న వసతులపై రివ్యూను ఐఏఎష్ చీఫ్ సమీక్షించారు.
హిమాలయాల్లో చలిగాలులపై పోరాడేందుకు బలగాలకు అదనపు బలం చేకూరేందుకు డీఆర్డీఓ మరిన్ని ప్రొడక్ట్ లను తీసుకొచ్చింది. వాటిల్లో ఒకటే ఈ హిమ్ టపాక్ స్పేస్ హీటింగ్ డివైజ్ (బుఖారీ), దీని వల్ల బ్యాక్ బ్లాస్ట్, కార్బన్ మోనాక్సైడ్ లాంటి పాయిజనింగ్ సమస్య కూడా ఉండదు. అంతే ఇండియన్ ఆర్మీ రూ.420కోట్లకు పైగా ఆర్డర్ ఇచ్చేసింది.
డీఆర్డీఓకు చెందిన డిఫెన్స్ ఇన్ స్టిట్యూట్ ఫర్ ఫిజియోలజీ అండ్ అల్లీడ్ సైన్సెస్ (డీఐపీఏఎస్) డైరక్టర్ డా. రాజీవ్ వర్షనీ మాట్లాడుతూ.. ఆర్మీలో ఉండే వారికి, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) వారికి టెంపరేచర్ బాగా తక్కువైన ప్రాంతాల్లో ఉండే వారికి ఈ డివైజ్ అందజేస్తారు.
యుద్దవాతావరణం ఉన్న పరిస్థితుల్లో హ్యూమన్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవడానికి ఫిజియోలాజికల్, బయోమెడికల్ గా లపై డీఆర్డీఓ రీసెర్చ్ నిర్వహిస్తుంది. ఈ కొత్త డివైజ్ ఆయిల్ వినియోగం కూడా సగమే. సంవత్సరానికి రూ.3వేల 650కోట్ల వరకూ ఆదా చేయొచ్చు. ఎక్కువ ఎత్తున్న ప్రదేశాల్లో గాలి వేగం ఎక్కువగా ఉండటమనేది బ్యాక్ బ్లాస్ట్ రిస్క్ ను క్రియేట్ చేస్తుంది. కానీ, ఇ:దులో వాడే సమాంతర రెండు పొరల ప్లేట్లు గాలి వేగాన్ని నియంత్రిస్తాయి.
మరో బెనిఫిట్ ఏంటంటే.. వీటి కెపాసిటీ ఆరులీటర్లు ఉండటంతో పాటు 100శాతం కాల్చడానికి వీలుంటుంది. ఇవి కార్బన్ మోనాక్సైడ్, ఇతర ప్రమాదకర గ్యాస్ రిలీజ్ చేస్తాయనే ప్రసక్తే లేదు.