లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

బిస్కట్ తిని టేస్ట్ చెబితే ఏడాదికి రూ.40లక్షల జీతం

Published

on

Biscuit JOB: ఏడాదికి 35 సెలవులు.. సంవత్సరానికి రూ.40లక్షలు అంటే నెలకు మూడు లక్షల రూపాయలకు పైగా జీతం.. బోనస్‌లు, ఇంక్రిమెంట్లు వీటికి అదనం. ఇన్ని అద్భుతమైన ఆఫర్లు ఎంత కష్టమైన పని చేస్తుంటేనో ఇస్తారనుకుంటే తప్పులో కాలేసినట్లే.

కేవలం బిస్కెట్లు టేస్ట్‌ చేసి ఫీడ్‌ బ్యాక్‌ ఇస్తే సరిపోతుందని అంటున్నారు. ఏడాదికి అక్షరాల రూ.38 లక్షల జీతం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కంపెనీ ప్రకటన ఇచ్చింది. ఇంకేముంది వరదల్లా అప్లికేషన్లు వచ్చి పడ్డాయి.బోర్డర్ బిస్కెట్స్ అనే యూకేకు చెందిన స్కాటిష్ బిస్కెట్ కంపెనీ.. కొత్త ఉద్యోగాన్ని సృష్టించింది. బిస్కెట్ రుచి చూసి చెప్పడమే వాళ్ల పని. ఇందుకోసం ప్రత్యేకంగా నియమించిన మాస్టర్లకు రుచి చూసినందుకు గాను సంవత్సరానికి 40 వేల పౌండ్లు చెల్లిస్తారని అన్నారు. అదే మన కరెన్సీలో చెప్పాలంటే సుమారు 40 లక్షలుగా ఉండనుంది. నెలకు 3 లక్షల రూపాయల చొప్పున పైగా జీతం వస్తుందట. ఈ ఉద్యోగం కోసం, మీకు ప్రత్యేక ప్రతిభ ఉండాలి.

ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి పరీక్షలు నిర్వహిస్తారు, బిస్కెట్లపై మంచి పరిజ్ఞానంతో పాటు కస్టమర్లతో మంచి రిలేషన్ మెయింటైన్ చేయడానికి కావాల్సిన సూచనలు ఇచ్చే వారికి ప్రియారిటీ ఇస్తారు. బేకరీ ప్రొడక్ట్స్, ప్రక్రియలతో శాస్త్రీయ, ఆచరణాత్మక అనుభవం.

యూకే రూల్స్, టెక్నాలజీ, ఇండస్ట్రీ సంకేతాల గురించి అవగాహన ఉండే వ్యక్తి అవసరం అని కంపెనీ వెల్లడించింది. సెలక్ట్ అయిన వ్యక్తికి ఏడాదికి 35 రోజుల సెలవు, బోనస్ స్కీమ్, 1000కి పైగా రిటైలర్స్‌లో డిస్కౌంట్, ఉచిత ఆన్‌లైన్ వ్యాయామ కార్యక్రమాలు, ఉచిత బిస్కెట్లు వంటి ఫెసిలిటీస్ కూడా ఉంటాయి.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *